ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎక్కువగా కురవడంతో ఎక్కువగా వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది ప్రజలు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే జలుబు జ్వరాలు బారిన పడే అవకాశం కూడా ఉన్నది. ఈ కాలంలోనే ఎక్కువగా ప్రతి ఒక్కరు శుభ్రతను పాటించాలి. లేకపోతే దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది అవి కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ , టైఫాయిడ్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జ్వరం వచ్చిన వారు ఫుడ్ విషయంలో చాలా రకాలుగా తినాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ తినవచ్చా లేదా అని సందేహం కూడా ఉంటుంది అయితే ఇలాంటి విషయంపై నిపుణులు కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు.వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు తేలికయ్య ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అలాంటి ఆహారమే త్వరగా డైజెస్ట్ అవుతుందని తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ఆహారమే త్వరగా శక్తిని ఇస్తుందని తెలుపుతున్నారు.


జ్వరం వచ్చినప్పుడు కోడిగుడ్లు, చికెన్, చేపలు వంటి నాన్ వెజ్ వాటిని తింటే అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి కొత్తలో చికాకుగా అనిపించి అజీర్తి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయట . అంతేకానీ వాటిని తినడం వల్ల జ్వరం ఎక్కువ అవ్వదట. ఇక ఇతర జబ్బులు కూడా రావని వైద్యులు తెలియజేస్తున్నారు. అందుచేతనే జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ ను తినవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని తెలియజేస్తున్నారు.


శరీరానికి కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్స్ కూడా చాలా అవసరమే అందుచేతనే ప్రోటీన్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా లభిస్తాయి అందుచేతనే నాన్ వెజ్ తింటే చాలా లాభాలు ఉంటాయి. అయితే జ్వరం వచ్చినప్పుడు వాంతులు వికారంగా ఉంటే వారు చేపలు చికెన్ వంటివి తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక అలాంటివారు మసాలా కారం వంటివి తగ్గించుకోవడం చాలా మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: