సాధారణం గా గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఏ వైద్యుడు దగ్గరికి వెళ్ళినా కూడా చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు ఒక గుడ్డును క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలం గా  ఉంచుకున్నట్లే అని సలహా ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమం  లోనే ఇటీవల కాలంలో ఎంతో మంది తమ రోజు వారి ఆహారంలో ఒక గుడ్డుని భాగంగా మార్చుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అయితే గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలుసు.


 కానీ ఇక ఉడకబెట్టిన గుడ్డును కూడా ఎలా తినాలో అలాగే తినాలి. కానీ ఇష్టం వచ్చినట్లుగా తింటాం అంటే మాత్రం ఇక ఆరోగ్యానికి మంచి చేసే కోడి గుడ్డు కూడా చివరికి ప్రాణాలు తీసే వ్యాధులకు కారణమవుతుంది అన్నది అప్పుడప్పుడు తేర మీదికి వస్తూ ఉంటుంది అని చెప్పాలి. చలికాలంలో సాధారణంగా ఇంట్లో ఉన్న ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకొని తినడం ప్రతి ఒక్కరికి అలవాటు. దీంతో వండిన అన్ని పదార్థాలను కూడా పదే పదే వేడి చేస్తూ ఉంటారు చాలామంది. ఈ క్రమంలోనే ఇక గుడ్లను కూడా ఇలా వేడి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇలా చేస్తే మాత్రం ప్రమాదకరమని పోషకాహారా నిపునులు హెచ్చరిస్తున్నారు. గుడ్లను వండిన వెంటనే తినాలని చెబుతున్నారు నిపుణులు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని తిరిగి వేడి చేయకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ అలా వేడి చేసి తిన్నారు అంటే గుడ్డులో ఎక్కువగా లభించే నైట్రోజన్ క్యాన్సర్ కారక ప్రిరాడికల్స్ ని విడుదల చేస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే గుడ్లను కేవలం వండిన వెంటనే తినాలని మళ్ళీ వేడి చేసి చివరికి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవద్దంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: