బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..జీవక్రియను పెంచడంలో ఇవి సహాయపడతాయి.ప్రతిరోజూ ఉదయం పూట శనగలు, బెల్లం కలిపి తిన్నట్లయితే కండరాలు చాలా దృఢంగా ఉంటాయి. ఇంకా అలాగే ప్రతిరోజూ వ్యాయాయం చేసే వారు, జిమ్ కు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా వీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఈ బెల్లంలో పొటాషియం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.వీటిని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా ఎక్కువగా అధికబరువు , ఊబకాయంతో ఎంతగానో బాధపడుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి శనగలు, బెల్లం మంచి దివ్యౌషధం లాంటివి. అందుకే వీటిని ప్రతిరోజూ డైట్ లో తీసుకున్నట్లయితే చాలా ఈజీగా బరువు తగ్గుతారు. ప్రతిరోజూ 100గ్రాముల శనగలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి ఖచ్చితంగా 19 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.ఇంకా అలాగే చాలామందిలో కూడా ఎసిడిటి సమస్య ఉంటుంది.


ఎసిడిటి సమస్యను తగ్గించాలంటే ఈ బెల్లం, శనగలు తినాలి. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఇంకా ఇవి మీ జీర్ణశక్తిని బలంగా ఉంచుతాయి.అలాగే శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్‎లను కూడా యాక్టివేట్ చేస్తాయి.ఇక వీటిని తరచుగా ఆహారంలో చేర్చుకొని తిన్నట్లయితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను బాగా ప్రోత్సహిస్తుంది. దీంతో మీ మెదడు పనితీరు కూడా చాలా బాగా మెరగవుతుంది. ఇంకా అంతేకాదు ఒత్తిడి కూడా చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే గుండె సంబంధిత జబ్బులను నయం చేయడంలో శనగలు, బెల్లం చాలా రకాలుగా మేలు చేస్తాయి. అంతేగాక ఇవి అధికరక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. శనగల్లో కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: