కొత్త సంవత్సరం మొదలవగానే చైత్రమాసంలో చెట్లన్నీ కొత్త ఆకులను చిగురిస్తాయి. ముఖ్యంగా చింత చెట్లకు చిగురించే ఆకుల వల్ల, మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు. చింత చెట్టులో తినడానికి పుల్లగా ఉన్న చింత ఆకులు, చింతకాయలు చింతపండు,చింతగింజలు ప్రతి ఒక్కటి ఆయుర్వేద ఉపయోగాల ఔషధాలను కలిగి ఉన్నవే. వీటన్ని ఉపయోగించి మనం ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1).రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి..
ఎవరికైతే రోగనిరోధకశక్తి తక్కువ అవడం వల్ల,సీజనల్గా వచ్చే దగ్గు,జలుబులతో బాధపడుతుంటారు. అలాంటివారు చింతాకుతో పచ్చడి గాని,పప్పు గాని తరచూ చేసుకొని తినడం వల్ల,రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

2). స్కర్వి నివారణకు..
విటమిన్ సి తక్కువ అవడం వల్ల,స్కర్వి వ్యాధి వస్తుంది. అందువలన స్కర్వి వ్యాధితో బాధపడేవారు,విటమిన్ సి అధికంగా ఉన్న చింతాకులను రోజువారి ఆహారాలలో వండుకొని తినడం వల్ల,స్కర్వీ వ్యాధికి ఉపశమనం కలిగించుకోవచ్చు.

3).చర్మవ్యాధుల నివారణకు..
చింతాకులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ వ్యాధులను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులు కలవారు ఈ ఆకురసాన్ని గాయాలపై తరచూ అప్లై చేయడం వల్ల, తొందరగా ఉపశమనం కలుగుతుంది.

4).షుగర్ కంట్రోల్..
చింతాకులను తరచూ తీసుకోవడం వల్ల, ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాలు,రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచడమే కాకుండా, క్లోమంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

5).క్యాన్సర్ నివారణకు..
ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ ని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ దరిచేరనివ్వకుండా దోహదపడుతాయి. ముఖ్యంగా చర్మ క్యాన్సర్ తో బాధపడేవారు,తరచూ చింతాకుల రసాన్ని తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

6).కంటిచూపు మెరుగుపరచుకోవడానికి..
ఇందులో కంటి చూపుకు దోహదపడే విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. రేచీకటి మరియు కంటి చూపు తగ్గిన వారు ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల వారి కంటి చూపు మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: