అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు ఎక్కువగా మేకప్ వేసుకుంటారు. అయితే చాలా మందికి చర్మ వ్యాధులు వస్తుంటాయి. అందంగా కనిపించడం కోసం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయరు. బ్యూటీ పార్లర్ లో చేతులు, కాళ్లు శుభ్రం చేయడం కోసం మ్యానుక్యూర్ ను వాడుతారు. గోళ్లను శుభ్రం చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తారు.  దీన్ని వాడటం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఈ మ్యానుక్యూర్, పెడిక్యూర్ వల్ల తీవ్ర ఇబ్బందులే వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. మ్యానుక్యూర్ తో భారత్ లో ఏటా దాదాపు 13 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుంది. కానీ దీని వల్ల క్యాన్సర్ వచ్చి సివియర్ ర్యాషెస్ వస్తాయని  లీసా డూరీ అనే శాస్త్రవేత్త ప్రకటించింది. జల్ నెల్స్, ఆర్టిపిషీయల్ నెల్స్ వల్ల ప్రాబ్లం అవుతున్నట్లు ఆమె తెలిపింది.


వీటి వాడకం వల్ల లీసా డూరీ కూడా క్యాన్సర్ బారిన పడినట్లు ఆమె స్వయంగా పేర్కొంది. జల్ నెల్స్, ఆర్టిపిషీయల్ నేల్స్ వల్ల గోళ్ల వెనక రంగు మారినట్లు లీసా గుర్తించింది. తర్వాత కాలంలో  ఆ చేత్తో వేటిని పట్టుకోలేక పోయానని ఆమె తెలిపింది. తీవ్ర అనారోగ్యానికి గురై, తర్వాత చూస్తే స్కిన్ క్యాన్సర్ అని తేలిందంట. దీని ఇంపాక్ట్ ముఖంపై, మెడపై ఎక్కువగా ఉంటుంది. సెలూన్ వర్కర్లు కూడా ఈ వాసనల వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. పెర్టిలిటీ ప్రాబ్లం వస్తాయి.


చేతులు పనికి రాకుండా పోవడం, అల్ట్ర వయిలేేట్ లైటింగ్ పై పెయింటింగ్ వేయడం వల్ల వచ్చినటు వంటి స్కిన్ డిసిస్ అని తెలుస్తోంది. ముఖ్యంగా దీని ఇంపాక్ట్ నెక్, చెస్ట్ పై పడి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోళ్లకు పెయింటింగ్ వేసుకుంటే క్యాన్సర్ రావడం అనేది అరుదైన విషయం. దీంతో స్కిన్ క్యాన్సర్ తో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందంతో పాటు ఆరోగ్యం ముఖ్యమని మహిళలు, అమ్మాయిలు గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: