ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఆహారపు అలవాట్లు,సరిగా బ్రష్ చేయకపోవడం వంటి కారణాలవల్ల డెంటల్ క్యావిటీస్ కి గురవుతున్నారు. మన డెంటల్ క్యావిటీస్ మొదలయ్యాయి అంటే అవి ఎప్పటికీ పోవు.ఇంకా కొంతమందిలో ఒక పంటిలో మొదలైన క్యావిటీస్ ఒకదాని తర్వాత ఒకటిని పాడు చేసుకుంటూ వస్తాయి.ముఖ్యంగా పిల్లల్లో డెంటల్ క్యావిటీస్ కి కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడమే అని దంత వైద్యులు చెబుతున్నారు.

ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో 20% మంది ఆరు నుంచి ఏడు సంవత్సరాల లోపు పిల్లలు క్యావిటీస్ కి గురవుతున్నారు.పిల్లల్లో డెంటల్ క్యావిటీస్ రావడానికి పళ్ళపై చెడు బ్యాక్టీరియా పేరుకుపోవడమే.వారు తినే కార్బోహైడ్రేట్స్ మరియు స్టార్చ్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల,చెడు బ్యాక్టీరియా పళ్లపై ఎక్కువగా పేర్కొని పోతుంది.ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తినడానికి కూల్ డ్రింక్స్ తాగడానికి,చిప్స్,బ్రెడ్ వంటి స్నాక్స్ తినడానికి మోగ్గు చూపుతూ ఉంటారు.ఈ షుగర్ పదార్థాలు తిన్నప్పుడు,అవి పళ్ళపై యాసిడ్ ని ప్రొడ్యూస్ చేసి,పళ్ళపై ఉన్న డెంటిన్ అనే పదార్తాన్ని దెబ్బతీస్తుంది.దీనితో క్రమంగా క్యావిటీస్ వస్తాయి. సాధారణంగా క్యావిటీస్ మొదలైన 7లేదా 8 సంవత్సరాలకు అతి ప్రమాదకరంగా మారుతాయి.ఆ సమయంలో పళ్ళు తీసేయడం తప్ప ఏమీ చేయలేము.

పిల్లలకు పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే,కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు ఇవ్వాలి.ముఖ్యంగా పెరుగు, చీజ్,స్ట్రాబెర్రీ,ఆపిల్,సీట్రస్ ఫ్రూట్స్ తరుచూ తీసుకోవడం వల్ల,పళ్ళపై ఉన్న చెడు బ్యాక్టిరియా నశించి పోతుంది.మరియు తరుచూ స్నాక్స్ తినే అలవాటు మానుకోవాలి.ముఖ్యంగా తీపి పదార్థాలను తినడం తగ్గించాలి.ఒక వేళ తిన్నా,వెంటనే బ్రష్ చేసుకోవడం ఉత్తమం.మరియు పిల్లలకు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేయాలి.భోజనం కానీ,ఏదైనా తిన్న వెంటనే నీళ్లను నోట్లో పోసుకొని పుక్కిలించాలి.అప్పుడే పళ్ళు సందుల్లో ఇరుక్కున్న పదార్థాలు తొలగిపోయి,క్యావిటీస్ తగ్గుతాయి.మరియు పాలకూర, మెంతికూర,కొత్తిమీర వంటి ఆకుకూరలు పళ్ళు ఆరోగ్యాంగా ఉండటానికి దోహదపడతాయి.అంతే కాక పిల్లలకు ఒమేగా త్రి ప్యాటి యాసిడ్స్ అధికంగా వున్న చేపలు,పుట్టగొడుగుల వంటి ఆహారాలను తినడం అలవాటు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: