
1). ముందుగా ఒక గిన్నెలో కొన్ని మెంతులను తీసుకొని వాటిని నానబెట్టాలి అలా మరుసటి రోజు ఆ గింజలను బాగా నూరి అందులోకి కాస్త కొబ్బరి నూనెను కలుపుకొని ఆ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించి ఒక అరగంటసేపు అలా ఉంచిన తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుందట.
2). ఒక గిన్నెలో పెరుగును తీసుకొని అందులోకి కాస్త ఆలివ్ ఆయిల్ కలుపుకొని ఆ మిశ్రమాన్ని తల కు అప్లై చేసినట్లు అయితే జుట్టు వదులుగా ఉండడమే కాకుండా చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
3). ఇక మరొక పద్ధతి ఏమిటంటే కాస్త వేప నూనె తీసుకొని అందులోకి నిమ్మరసాన్ని కలిపి.. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించినట్లు అయితే చుండ్రు సమస్య తగ్గుతుంది ఇలా వారానికి కనీసం రెండుసార్లు అయినా చేస్తే.. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు విముక్తి పొందవచ్చు.