కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా కార్మికులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇక మీరు కూడా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వం ఈ పథకం కింద 2 లక్షల రూపాయల వరకు మీకు బీమా ప్రయోజనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందించడం, వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అమలులోకి తీసుకొస్తుంది. ఇక కార్మికులకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఈ శ్రమ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద కార్మికులు ఈ శ్రమ కార్డును పొంది వివిధ రకాల ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు.


ఇక ఈ శ్రమ  స్కీం ప్రయోజనాన్ని పొందడానికి ముందుగా ఈ శ్రమ పోర్టల్ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి. ఇక్కడ మీరు ఈ శ్రమ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి,  ఆ తర్వాత ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఇక ఇప్పుడు ఒక క్యాప్చ కోడు వస్తుంది. దానినీ ఎంటర్ చేసి సెండ్ ఓటీటీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక దీని తర్వాత అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి.  పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత సమర్పించు బటన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఇక అసంఘటిత రంగంలో కార్మికులుగా ఉన్న వారు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఇకపోతే ఈ శ్రమ  పథకం కింద నమోదు చేసుకున్న కార్మికులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా రెండు లక్షల వరకు ప్రమాద బీమా ఉచితంగా అందించబడుతుంది.

ఇదే కాదు ఈ శ్రమ  పోర్టల్ లో నమోదు చేసుకున్న వారి యొక్క పూర్తి డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది.కాబట్టి భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పథకాలు అయినా సులువుగా పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: