ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ పథకాల వల్ల చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు వారికి మరింత ఆసరాగా నిలుస్తున్నాయి. ఇకపోతే కేంద్రం తీసుకొచ్చిన పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి. ఉచితంగానే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ పథకం ద్వారా అనేక ప్రయోజనాలను అందిస్తోంది.


అందులో భాగంగానే రైతులు పంట పెట్టుబడికి కొంతవరకు ఊరట పొందుతున్నారు ఇప్పటికే 13 విడతల డబ్బులను రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది.  ఒక్కో విడతకు రూ. 2000 చొప్పున లెక్క వేసినట్లయితే ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో సుమారుగా 26 వేల రూపాయలు ఉచితంగా జమ అయ్యాయి. భారత ప్రభుత్వం 13వ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులను ఈసారి చాలా ఆలస్యంగా రైతుల ఖాతాలో జమ చేసింది. వాస్తవానికి ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఈ డబ్బులు రావాల్సి ఉంది.


రెండో విడత డబ్బులు ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో వస్తే మూడో విడత డబ్బులు డిసెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో పడతాయి. ఇలా చూస్తే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో పిఎం కిసాన్ 14వ విడత డబ్బులు రావాలి. ఈ సినిమా 13వ విడత డబ్బులు ఫిబ్రవరి 26న వచ్చాయి అలాగే 14వ విడత డబ్బులు ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో రావాల్సి ఉంది మరి ఈసారి కూడా డబ్బులు ఆలస్యంగా వచ్చేటట్టు కనిపిస్తున్నాయి.  అయితే సాధ్యమైనంత వరకు త్వరలోనే ఈ డబ్బులు వేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇకపోతే మీరు ఆన్లైన్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి లేకపోతే ఈ డబ్బులు రావన్న విషయాన్ని గుర్తించుకోవాలి. దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసి డబ్బు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: