ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రాధాన్యత ఇస్తోంది.. ఇప్పటికే అమ్మబడి, విద్యా దీవెన, రైతు భరోసా వసతి దీవెన తదితర వంటి వాటికి జగన్ సర్కార్ పథకాలను తీసుకొని వచ్చారు. ఇదే తంతులో వైయస్సార్ ఈ బీసీ నేస్తం కింద ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం భాగంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న పేద మహిళలకు ఆర్థిక సహాయం కింద అందిస్తారని తెలియజేయడం జరిగింది. ఈనెల 12వ తేదీన వైయస్సార్ ఈబిసీ నేస్తం పథకాన్ని అమలు చేయబోతున్నారు. జగన్ కేవలం ఒక్క బటన్ నొక్కి మహిళల ఖాతాలో డబ్బు జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రెడ్లు, కమ్మ, ఆర్య, వైశ్య, బ్రాహ్మణ, వెలయ ,ఓసి సంఘానికి చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుందట.


అయితే ఇందుకు కుటుంబ ఆదాయం గ్రామాలలో నెలకు రూ.10 వేలు, పట్టణాలలో రూ .12 వేలు మించి ఉండకూడదు..

అలాగే భూమి మూడు ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి మిట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.

కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు.

కుటుంబంలో ఎవరు కూడా పెన్షన్ తీసుకునేవారు కాకూడదు.

పారిశుద్ధ్య కార్మికుల కు మాత్రం ఈ నిబంధనలో మినహాయింపు ఉంటుంది.

అలాగే కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఫోర్ వీలర్ ఉంటే ఈ పథకం వర్తించదు.. అలాగే ఆదాయ పన్ను కట్టే వారికి ఈ పథకం అసలు వర్తించదు. అలాగే వైయస్సార్ చేయూత కాపు నేస్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ పథకం వర్తించదు.

ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హులను సైతం ప్రభుత్వం గుర్తించి ఫైనల్ జాబితాను గ్రామ వార్డు సచివాలయాలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈనెల 12వ తేదీన ఈ పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయబోతోంది. మొత్తం మీద 8,85,567 దరఖాస్తులు రాగ ఇందులో..8,70,239  మాత్రమే అర్హులు అయినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: