ప్రస్తుత కాలంలో ప్రజలు తమ ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు ఊపందుకోవడానికి కూడా కారణం ఇదే అనే చెప్పాలి. ఒకవేళ మీరు కూడా ఉద్యోగం కోసం వెతికి వెతికి అలసిపోయి ఉంటే ఇప్పుడు చెప్పబోయే వ్యాపారం మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. ఇకపోతే మీరు కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నట్లయితే మునగ సాగు మీ వ్యవసాయానికి మంచి ఎంపిక అని చెప్పాలి. రైతులకు నిర్దిష్టమైన ఆదాయంతో పాటు అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

మునగకాయ పువ్వులు ఇలా ప్రతి వాటిల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి మీరు సంవత్సరానికి రూ.6 లక్షల వరకు ఈ సాగు చేసి సంపాదించవచ్చు. అంటే నెలకు 50 వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మునగా ఔషధ మొక్క కాబట్టి ఇటువంటి మొక్కల పెంపకంలో మార్కెటింగ్ ఎగుమతి కూడా చాలా సులభం. సరిగా పండించే ఔషధ పంటలకు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది.

ఇకపోతే మీకు నాణ్యమైన మొక్కలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి ఒకసారి మొక్కలను తెచ్చుకున్న తర్వాత నాలుగేళ్ల పాటు మళ్ళీ మొక్కలు నాటాల్సిన అవసరం ఉండదు. దీన్ని సాగుచేసిన 10 నెలల తర్వాత రైతులకు ఎకరంలో లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. ఈ సాగుకి పెద్దగా నీరు అవసరం లేదు. పైగా భూమి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం అర ఎకరం పొలంలో కూడా మీరు ఈ పంట పండించవచ్చు. ఇకపోతే మొక్కలు నాటిన తర్వాత గుంతలను మట్టితో పూడ్చేటప్పుడు 10 కిలోల కుళ్ళిన ఆవు పేడ ఎరువు మిశ్రమాన్ని ఉపయోగించాలి. డ్రిప్ పద్ధతిలో నీటిపారుదల చేస్తే నీరు ఆదా అవుతుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కేవలం అతి తక్కువ సమయంలోనే భారీ లాభాలను అది కూడా నాలుగు సంవత్సరాల పాటు శ్రమ లేకుండా పొందవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: