రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మక పథకమైన పీఎం కిసాన్ నిధి ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు కూడా లబ్ధి పొందుతున్నారు. ఇకపోతే అనేక రాష్ట్రాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇక రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి పిఎం కిసాన్ తో సహా అన్ని కేంద్ర కార్యక్రమాలను పూర్తిగా అమలు చేయాలని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తాజాగా కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ కేంద్రపాలిత ప్రాంతాల రైతుల సైతం అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరడం జరిగింది. ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీలో వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశం నిర్వహించినట్లు అధికారిక ప్రకటన కూడా వెల్లడయ్యింది. ముఖ్యంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఈ పథకాలు 100% అమలు జరిగేలా చూడాలని అక్కడి రైతులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని కోరారు.

అలాగే అర్హులైన రైతులు, పశుసంవర్ధక, మత్స్యకారులందరికీ కూడా ఈ విషయాన్ని అందజేయాలని కేంద్ర మంత్రి సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా ఇతర పథకాల ప్రయోజనాలను రాష్ట్రాలతో పాటు ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుండాలని అందుకే చిన్న రైతుల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పథకాలు, నిధుల కొరత ఏమీ లేదు కాబట్టి పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది అంటూ మంత్రి తెలిపారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రైతులకు మంచి ఊరట కలిగిస్తుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: