టాలీవుడ్ లో మాస్ మహరాజ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన రవితేజ ఆ మద్య కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాలతో భారీ డిజాస్టర్ చవిచూశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి రెండు సంవత్సాలు దూరమయ్యాడు. దాంతో రవితేజ కెరీర్ క్లోజ్ అయ్యిందని కొంద మంది అభిప్రాయ పడ్డారు. కానీ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’సినిమాతో అంధుడిగా నటించి తన మాస్ పవర్ ఏంటో చూపించాడు రవితేజ. ఈ సినిమా తర్వాత రవితేజకు బాగా కలిసి వస్తుందని భావించాడు. కానీ తన అంచనాలు మొత్తం రివర్స్ అయ్యాయి.
టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంథోని సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దాంతో తన తదుపరి సినిమా మంచి హిట్ కొట్టాలని అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్నాడు రవితేజ. ఇటీవల తన రెమ్యూనరేష్ విషయంలో కూడా దిగివచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ తాళ్లూరి నిర్మాణంలో.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. తాజాగా ఈ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
నేడు మాస్ మహరాజ రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలారు. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే..బటర్ ఫ్లై రూపంలో తెలుగు .. ఇంగ్లిష్ కలిసిన లెటర్స్ డిజైన్ చేశారు. టైటిల్ క్రింద రివైండ్ .. ఫార్వార్డ్ .. కిల్ అంటూ కొన్ని సంకేతాలతో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.