టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా కమిట్ అవ్వాల్సిందే అనే నానుడు ఎప్పటి నుండో ఉంది. అయితే ఇదే క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ పేరిట సోషల్ మీడియా సాక్షిగా ఎవరెవరు తమ ని ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చినప్పుడు వేధించారు అన్నదాని విషయంపై బహిరంగంగానే మీడియా ముందు తమ గొంతు వినిపించటం జరిగింది. ఇదే తరుణంలో ఇటీవల సీజన్ త్రీ తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోలో షో స్టార్ట్ అవ్వక ముందు కొంతమంది బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్తున్నట్టు సెలబ్రిటీల పేర్లు వినబడ్డాయి. వారిలో లేడీస్ కంటెస్టెంట్స్ ని షో నిర్వహించే యజమానులు కమిట్మెంట్ అడిగినట్లు అప్పట్లో అనేక ఆరోపణలు వినబడ్డాయి. దీంతో షో పై అనేక ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

 

ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కథని ఆధారం చేసుకుని  హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ ``నేను కమిట్ మెంట్ ఇస్తాను`` అనే సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే ఈ హాట్ బ్యూటీ ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు గట్టిగా వార్తలు వినపడ్డాయి. దానికి హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు.

 

తాజాగా దానికి సంబంధించిన మరింత అప్ డేట్ అందింది. ఈ వెబ్ సిరీస్ ను `కమిట్ మెంట్` అనే టైటిల్ తో తెరకెక్కించబోతున్నట్లు … సినిమా ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే ఆడవారిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ మోసం చేసే స్టోరీతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతున్నట్లు అటువంటి స్టొరీ బేస్ తో ``నేను కమిట్ మెంట్ ఇస్తాను`` అనే వెబ్ సిరీస్ లో తేజస్వి సినిమాలో బాధితురాలిగా నటించబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: