ఉయ్యాలా జంపాల సినిమాతో వెండి తెరకు పరిచయమైన హీరో రాజ్ తరుణ్. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. అనూప్‌ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఇటీవ‌ల విడుద‌లైన ‘కురిసెన.. కురిసెన..’ పాట‌కి మంచి స్పందన వ‌స్తోంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

ప్రముఖ దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ బుధవారం సాయంత్రం ఈ టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి మాత్రం రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’’ అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మ‌య్యే ఈ టీజ‌ర్ ఆద్యంతం హిలేరియ‌స్‌గా ఆక‌ట్టుకుంది. ‘‘అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక ఫ్లిఫ్‌ కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్ మై షో, ఒక క్రెడిట్ కార్డ్’’ అని అమ్మాయి చెప్పే డైలాగ్ యూత్‌కు కనెక్ట్ అవుతుంది.

 

 ‘‘మందుందా?’’ అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకి ‘‘నా దగ్గర పెద్దగా బ్రాండ్స్ లేవ‌మ్మా..’’ అని న‌రేష్ చెప్పే డైలాగ్‌.. దానికి స‌మాధానంగా ‘‘బాధకి బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’’ అని చెప్పే డైలాగ్ మ‌రింత ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మొత్తంగా ఒక నిమిషం ఇర‌వై సెకండ్ల నిడివి గ‌ల ఈ టీజర్ సినిమాపై అంచనాలని పెంచుతోంది. ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుద‌ల‌కాబోతుంది.

 

ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. వేణు కూరపాటి కో-డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కొండా విజయ్‌కుమార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: