సినిమాలో కామెడి పండాలి అంటే దర్శకుడు అయినా రచయిత అయినా సరే నటుడికి మాటలు రాయాల్సిన అవసరం ఉంటుంది. అలా అయితేనే కామెడి పండుతుంది అనేది వాస్తవం. కాని కృష్ణ భగవాన్ విషయంలో అలాంటిది ఏమీ లేదు. ఆయనకు ప్రత్యేకంగా మాటలు రాయాల్సిన అవసరం లేదని అంటారు. ఏ పాత్రలో అయినా సరే ఆయన నటిస్తారు. అది సీరియస్ సన్నివేశం అయినా సరే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు మంచి కామెడి పంచుతాయి అనేది వాస్తవం. కబడ్డీ కబడ్డీ సినిమాలో ఆయన మాటలతోనే కామెడి చేసారు. 

 

ఆ సినిమాలో ఆయన మాట్లాడిన ప్రతీ మాట కూడా నవ్వులు పూయించింది. ఇక బెండు అప్పారావు ఆర్ఎంపీ సినిమాలో ఆయన నటన ఎక్కువగా లేకపోయినా మాటలతో కామెడి చేసారు. సీరియస్ పాత్ర అయినా సరే ఆయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక రవి తేజా హీరోగా వచ్చిన సినిమా దుబాయ్ శీను సహా కొన్ని సినిమాల్లో ఆయన ఏదోక రూపంలో కామెడి చేసే వారు. హీరోల మాటల కంటే ఆయన మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేది వాస్తవం. ఆయనకు మాటలు రాసే అవసరం ఉండదు అని దర్శక నిర్మాతలు అంటూ ఉంటారు. 

 

అప్పటికప్పుడు సన్నివేశానికి తగిన విధంగా ఆయన నటిస్తారు. అగ్ర హీరోల సినిమాల్లో పెద్దగా నటించలేదు గాని ఆయన చేసిన సినిమాల్లో మాత్రం ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆయన సినిమా ల్లో నటించడం లేదు. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆయన్ను పక్కన పెట్టారు. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేసినా సరే ఆయనను ఎవరూ తీసుకోవడం లేదని అంటారు. ప్రస్తుతం ఆయన చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు అని మంచి పాత్ర వస్తే చేయడానికి రెడీ గా ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: