సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్స్ మరే ఇండస్ట్రీలోను ఉండదు. ఒకసారి సెంటిమెంట్ భయాలు ఏర్పడితే ఎంతటి ప్రముఖ వ్యక్తులను అయినా ఈసెంటిమెంట్స్ రీత్యా పక్కకు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను తీయడానికి ప్రయత్నాలు చేస్తూ స్క్రిప్ట్ విషయంలో చాల బిజీగా ఉన్న హరీష్ శంకర్ చుట్టూ ఒక అనుకోని సెంటిమెంట్ ప్రచారంలోకి వస్తోంది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి పవన్ ఇప్పటి వరకు పవర్ స్టార్ గా ఎదిగి 25 సినిమాలలో నటించినా పవన్ కళ్యాణ్ ను కూడ ఒక సెంటిమెంట్ వెంటాడింది.


పవన్ కళ్యాణ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి రెండో సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడం సాధారణంగా చేస్తూ ఉంటాడు. అయితే ఏ డైరెక్టర్ తోనైనా హిట్ కొట్టి మళ్ళీ ఆడైరెక్టర్ తో పవన్ తన రెండవ సినిమా చేస్తే అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అన్న నమ్మకం ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. పవన్ కళ్యాణ్ భీమినేని శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘సుస్వాగతం’  సూపర్ హిట్ గా మారితే ఆతరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ‘అన్నవరం’ ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. అదేవిధంగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’ టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెటర్ మూవీగా రికార్డు క్రియేట్ చేస్తే ఆతరువాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘బాలు’ ఘోర పరాజయం చెందింది.


అదేవిధంగా పవన్ ఎస్.జె. సూర్యాతో కలిసి చేసిన ‘ఖుషీ’ సూపర్ హిట్ అయితే తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కొమరం పులి’ భయంకరమైన ఫ్లాప్ గా మారింది. అదేవిధంగా పవన్ కు ‘బద్రీ’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ఆతరువాత ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా తీసినా అది సూపర్ ఫ్లాప్ అయింది. ఇక ఈలిస్టులో పవన్ తో సినిమాలు తీసిన డాలీ కూడ కొనసాగుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇచ్చిన ‘గోపాల గోపాల’ మంచి పేరును తీసుకువస్తే తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కాటమరాయుడు’ ఫ్లాప్ అయింది. అయితే ఈవిషయంలో ఒక్క త్రివిక్రమ్ మాత్రమే అదృష్టవంతుడు. పవన్ తో త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ ‘అత్తారింటికి దారేది’ సినిమాలు రెండు వరస విజయాలు సాధించి పవన్ నెగిటివ్ సెంటిమెంట్ ను జయించాయి.


అయితే అనూహ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ‘అజ్ఞాతవాసి’ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇప్పుడు ఇదే విషయం తనకు కూడ వర్తిస్తుందని హరీష్ శంకర్ గంపెడు ఆశతో ఉన్నాడు. పవన్ తో ‘గబ్బర్సింగ్’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ తీసి వెంటనే మరొక సినిమాను తీయలేకపోయినా హరీష్ శంకర్ త్వరలో పవన్ తో తీయబోతున్న తన రెండవ సినిమాకు త్రివిక్రమ్ పవన్ నెగిటివ్ సెంటిమెంట్ ను జయించినట్లే తాను కూడ జయిస్తాను అన్న నమ్మకంతో ప్రస్తుతం హరీష్ పవన్ స్క్రిప్ట్ విషయంలో అద్భుతాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: