మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. మొదటి నాలుగు సినిమాలకు చిరంజీవి క్రేజ్ నే క్యారీ చేశాడు. కానీ.. నాలుగో సినిమాతో ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా యువతలో అధ్భుతమైన మ్యాజిక్ చేశాడు పవన్. ఆ సినిమానే ‘తొలిప్రేమ’. తెలుగులో వచ్చిన అద్భుతమైన ప్రేమకథల్లో ఒకటిగా.. క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలై నేటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా నుంచే పవన్ కు ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమాకు ఇంపాక్ట్ అయిన యూత్, పిల్లలు ఈరోజు పవన్ కు పెట్టని కోటలా నిలిచారు.

IHG's Tholiprena

 

సినిమా 1998 జూలై 24న విడుదలైంది. ఈ సినిమా ప్రభంజనానికి ధియేటర్లన్నీ యూత్ కి అడ్డాలుగా మారాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. స్నేహితుల సరదాలను, ప్రేమికుల భావాలను, అందమైన కుటుంబ అనుబంధాలను అంతే హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు కరుణాకర్. దీంతో ఈ సినిమా అన్ని వార్గాల వారిని ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్ కీర్తిరెడ్డి ఎంట్రీ సినిమాకే హైలైట్. టీనేజర్లు, యూత్ అంతా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ విషయాల్లో ఈ సినిమాలోని పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు.

IHG

 

పవన్ తన కెరీర్లో ఓన్ డెసిషన్ తో యాక్పెప్ట్ చేసిన తొలి సినిమా ‘తొలిప్రేమ’. దేవా అందించిన సంగీతంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సినిమాలోని పాటలన్నింటికీ ఫిమేల్ సింగర్ లేకపోవడం విశేషం. పాటల చిత్రీకరణలో కూడా కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఎస్ఎస్ సీ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత జీవీజీ రాజు ఈ సినిమాను నిర్మించారు. పవన్ కల్యాణ్ కెరీర్లో తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా నిలిచింది. ఈ సినిమా మెగాభిమానులకు, పవన్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ ప్రత్యేకమే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: