బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కుటుంబానికి కరోనా సోకిందనే విషయం యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసింది. జయా బచ్చన్ మినహా అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య.. ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిలో ఇంకా ఎవరూ డిశ్చార్జి కాలేదు. కానీ ఓ హిందీ మీడియా చానెల్ అమితాబ్ ఆరోగ్యంపై ఓ బులెటిన్ ప్రసారం చేసింది. ఆయన కోలుకున్నారంటూ ప్రసారం చేయడంతో బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

IHG

 

‘అమితాబ్ కోసం అభిమానులు చేసిన ప్రార్ధనలు ఫలించాయి. ఆయనకు చేసిన టెస్టుల్లో నెగటివ్ వచ్చింది. బచ్చన్ కోలుకున్నారు’ అని ప్రసారం చేసింది ఆ ఛానెల్. దీనిపై అమితాబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ వార్తలో నిజం లేదు. ఇటువంటి నిరాధారమైన వార్తలు ఎలా ప్రసారం చేస్తారు. పూర్తిగా అబద్ధం’ అంటూ ట్వీట్ చేసారు. దీంతో అమితాబ్ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. ఆయనతో పాటు ఇంకా కుటుంబసభ్యులు ఎవరూ కోలుకున్నట్టు వార్తలు రాలేదు. కానీ ఇలా ప్రసారం చేయడంపై ఆయన అభిమానులకు కూడా ఆగ్రహం తెప్పించింది. దీంతో వారంతా అమితాబ్ కు సంఘీభావంగా ట్వీట్స్ చేశారు. బచ్చన్ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

IHG's Savage Reply To A Netizen Asking About Daughter ...

 

అమితాబ్ కుటుంబం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. సాధారణ చికిత్స అందిస్తున్నామని కూడా తెలిపాయి. త్వరలోనే వీరంతా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ తీవ్రమవుతోందే కానీ ఎక్కడా అదుపులోకి రావడం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దేశంలో కరోనా కేసులు 13 లక్షలకు చేరువలోకి వచ్చాయి. మహారాష్ట్రలో కేసులు కూడా 3లక్షలు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: