ఈమధ్య నందమూరి బాలకృష్ణ షష్టిపూర్తి ఫంక్షన్ కు సంబంధించి విడుదలైన ఫోటోలలో మోక్షజ్ఞ లుక్ చూసి బాలయ్య అభిమానులు కూడ ఇక ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య అభిమానులకు కిక్ ఇచ్చే ఒక న్యూస్ బయటకు వచ్చింది.


ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ విషయంలో ఇంకా బాలకృష్ణకు ఆశలు పూర్తిగా వదులుకోలేదు అని అనిపిస్తోంది. తెలుస్తున్న సమాచారంమేరకు రాజమౌళి టీమ్ లోని ఒక సహాయ దర్శకుడు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేసి మోక్షజ్ఞ కు బాలయ్య ఇంటిలోనే యాక్టింగ్ శిక్షణ ఇస్తున్నట్లు టాక్.


ఈ టీమ్ లో డైలాగ్ మాడ్యులేషన్ డాన్స్ ఫైట్స్ కు సంబంధించి మోక్షజ్ఞకు శిక్షణ ఇచ్చే ఒక ప్రత్యేక టీమ్ ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు వైరల్ కావడంతో మోక్షజ్ఞ తన మనసు మార్చుకుని మళ్ళీ సినిమాల వైపు రాబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు రావడం వాటి పై బాలయ్య స్పందించకుండా మౌనం వహించడం ఒక పరిపాటిగా మారింది. అయితే ఈసారి వస్తున్న ఈ లీక్ లు నిజమే అనిపించడానికి ఒక కారణం ఉంది.


తన షష్టిపూర్తి సందర్భంగా బాలయ్య ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ మోక్షజ్ఞ కు సినిమాల పై ఆసక్తి ఉందని ముఖ్యంగా అతడి తాత ఎన్టీఆర్ సినిమాలను మోక్షజ్ఞ ఎక్కువగా చూస్తూ ఉంటాడని తన కొడుకు ఫిలిం ఎంట్రీ గురించి వచ్చే ఏడాది మాత్రమే స్పష్టమైన క్లారిటీ ఇస్తానని కామెంట్ చేసాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ కు బలం చేకూర్చే విధంగా మోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగిన టీమ్ వార్తలు బయటకు రావడంతో ఈ వార్తలు నిజం కావాలని బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా నందమూరి అభిమానులు అంతా కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: