కరోనా వైరస్ బారిన పడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకోని వారు లేరు. తన గాత్రంలో దశాబ్దాలుగా దక్షిణ భారత సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు బాలు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైనే చికిత్స తీసుకుంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రి రిలీజ్ చేసిన బులెటిన్ లో ఆయనకు ఎక్మో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. బాలూ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ వర్గాలు బాలు కోలుకోవాలని కోరుకుంటూ గురువారం ఓ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గురువారం ప్రార్థనలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీరంగానికి చెందినవారు ప్రార్థనలో పాల్గొనాలని కోరారు. రేపు సాయంత్రం 6 గంటలకు 5 నిమిషాల పాటు ఈ ప్రార్థనలు జరగాలని సినీ ప్రముఖులు పిలుపునిచ్చారు. బాలు కోసం నిర్వహించనున్న ప్రార్థనల్లో భారతీ రాజా, కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎ.ఆర్.రహమాన్ తోపాటు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఈ మేరకు భారతీరాజా కూడా బాలు కోసం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన ప్రార్ధనలు ఫలించి బాలు ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో వైరల్ అయింది.
ఈమేరకు ప్రముక తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ఈనెల 20న సాయంత్రం 6 గంటల నుంచి 5 నిముషాలపాటు ఎక్కడివారు అక్కడే బాలు ఆరోగ్యం కోసం ప్రార్ధించండి. బాలు త్వరగా కోలుకోవాలని కోరుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. తెలుగులో కూడా చిరంజీవి మోహన్ బాబు, కోటి.. తదితరులంతా బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  బాలు అన్ని భాషల్లో వేలాది పాటలు పాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: