కోవిడ్ 19 లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న కొత్త పెళ్ళికొడుకు నితిన్ వరుసగా చిత్రాలు ప్రకటించారు. శ్రీనివాస కళ్యాణం మూవీ తరువాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న నితిన్ భీష్మ మూవీతో వచ్చి బంపర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నితిన్ కి సరైన సమయంలో విజయం అందించింది. కాగా విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో నితిన్మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ప్రీ లుక్ పోస్టర్ నేడు విడుదల చేశారు. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాల్లోకి వెళితే... 
చెక్ అనే టైటిల్ తో రానున్న ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. నితిన్ చేతికి బేడీలు ఉండగా, కుడి చేతి వేళ్ళకు నకుల్ వెపన్ ధరించిన ఆనవాళ్లు వున్నాయి. ఇక చెస్ బోర్డు, దానిపై చిందరవందరగా ఉన్న పావులు ఉన్నాయి. విభిన్నంగా ప్రీ లుక్ ఆసక్తి రేపుతుండగా, నితిన్ గ్యాంగ్ స్టర్ లేదా, రౌడీ ఫెలో అయ్యే అవకాశం కలదు. ఇక టైటిల్ ని బట్టి చూస్తే మూవీ స్క్రీన్ ప్లే ప్రధానంగా, సూపర్ మైండ్ గేమ్ తో నడిచే అవకాశం కలదు.
ప్రీ లుక్ పోస్టర్ తోనే చిత్ర యూనిట్ మూవీపై అంచనాలు పెరిగేలా చేశారు. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మొత్తంగా చెక్ మూవీతో నితిన్ మరో హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. ప్రస్తుతం రంగ్ దే సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఇక తరువాత బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: