మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా పెళ్ళికి రెడీ అవుతున్నాడా అంటే అవును నిజమే అంటున్నాయి సినిమ వర్గాలు. మెగా కాంపౌండ్ నుండి అందించిన సమాచారం ప్రకారం మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కు ఆంధ్రా అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ చేశారట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాలో అతని జోష్ చూసి మెగా ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారు.  

మెగా ఫ్యాన్స్ కు అతి కొద్ది టైంలోనే దగ్గరైన సాయి ధరం తేజ్ కొన్నాళ్లు ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే వాటన్నిటికి చెక్ పెట్టి ఫైనల్ గా ఈ యువ హీరో పెళ్ళికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్ళి బాజాలు మోగనున్నాయని తెలుస్తుంది.

ఈ లాక్ డౌన్ టైం లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనుకున్న రానా, నిఖిల్, నితిన్ లు పెళ్ళి చేసుకున్నారు. మెగా డాటర్ నిహారిక కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంది.  ఇక లైన్ లో ఉన్న మెగా హీరోల్లో సాయి ధరం తేజ్ కూడా పెళ్ళికి రెడీ అంటూ తెలుస్తుంది. సాయి ధరం తేజ్ మదర్ సాయికి జోడీని వెతికి సెట్ చేశారట. త్వరలోనే ఈ న్యూస్ కు సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందని తెలుస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే సాయి ధరం తేజ్ త్వరలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ దేవా కట్టా డైరక్షన్ లో ఓ సినిమా.. సుకుమార్ అసిస్టెంట్ కార్తికేయ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.      
 

మరింత సమాచారం తెలుసుకోండి: