ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌ లలో ఒకరుగా ఉన్న సమంత షూట్ కి రెడీ అయిపోయినట్టు చెబుతున్నారు. ఈమె అంతకు ముందే ఒప్పుకున్న సినిమాలు తప్ప ఇప్పుడు కొత్తగా మరే సినిమా ఒప్పుకోలేదు. అయితే ఆమె నటించబోయే తదుపరి సినిమాని గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సమంత ఒక మూగ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు ముందు నుండీ ప్రచారం జరుగుతోంది. ఇలా శారీరక వైకల్యాలున్న పాత్రను సమంత చేయడం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు.

బాలీవుడ్‌ సహా దక్షిణాది బాషలలో విడుదల కానున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా షూట్ కోసం ఆమె రెడీ అవుతోందని సమాచారం. ఈ సినిమా షూట్ నవంబర్ నుండి మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఓ బేబీ మరియు జాను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పటి వరకు అధికారికంగా కొత్త సినిమాలకు కమిట్ కాలేదు.

కరోనా కారణమా లేక ఆమె మొదలు పెట్టిన బిజినెస్ ల కారణమో తెలియదు కానీ, ఈ ఏడాది ఆమె కొత్త సినిమాలత వచ్చే అవకాశం లేదు. అయితే సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సిరీస్ ఈ ఏడాది రిలీజ్ లో అయ్యే అవకాశం ఉంది.  ఈ వెబ్ సిరీస్ లో ముందు నుండీ సమంత నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమె పాకిస్తానీ ఉగ్రవాది పాత్రలో సమంత కనిపించబోతుందని అంటున్నారు. ఇక ఆమె తన బిజినెస్ పనుల్లో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: