రణ్‌బీర్ కపూర్‌కి బాలీవుడ్లో ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. సినిమాకో మేకోవర్ మార్చినట్టు, గర్ల్ ఫ్రెండ్స్‌ని మారుస్తాడనే టాక్ ఉంది. దీపిక పదుకొణే, కత్రీన కైఫ్‌తో డీప్ లవ్ మెయింటైన్ చేసిన రణ్‌బీర్ తర్వాత వాళ్లిద్దరికీ బ్రేకప్ చెప్పాడు. నర్గీస్ ఫక్రీలాంటి హీరోయిన్లతోనూ డేట్ చేశాడు. టోటల్‌గా డజను వరకు హీరోయిన్లతో డేట్ చేసిన రణ్‌బీర్ ఇప్పుడు ఆలియా భట్‌తో రిలేషన్లో ఉన్నాడు.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మూడేళ్లుగా రిలేషన్లో ఉన్నారు. రెండేళ్ల నుంచి వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు పెళ్లి డేట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదు. హాలిడే ట్రిప్పులు, ఫ్యామిలీ టూర్లు అని తిరుగుతున్నారు గానీ, పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.
ఆలియా భట్ ఇప్పుడు కూడా హాలిడే టూర్లో ఉంది. 'ట్రిపుల్ ఆర్' షూటింగ్లో బ్రేక్ రాగానే లవర్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి గోవా వెళ్లిపోయింది. అయితే ఇప్పటికే వీళ్లిద్దరి పెళ్లి రెండు సార్లు వాయిదా పడింది. ఒకసారి రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్‌కి క్యాన్సర్ ఎటాక్ అయ్యిందని పెళ్లి వాయిదా పడింది. మరోసారి రిషి కపూర్ మరణంతో పెళ్లి వాయిదా పడింది
. మొత్తానికి అలియా భట్ బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది. ఏ మాత్రం సమయం దొరికినా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి టూర్ లకు వెళుతోంది. ఈ జంట గురించే ఇపుడు సినీ వర్గాల్లో చెవులు కొరుక్కుంటన్నారు.