చాలామంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ముందు ఎన్నో కలలతో వస్తుంటారు. అలా వచ్చిన వారు తమ నటనతో, ఆహార్యంతో, అందంతోప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. అయితే అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారందరూ సక్సెస్ అవ్వాలని లేదు. కొంతమందికి విజయం చేకూరుతుంది. మరికొంత మంది ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతూ చిన్నచిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంటారు. ఇదే దారిలోనే నటి హెబ్బా పటేల్ కూడా నడుస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే హెబ్బా పటేల్ ముంబైకి చెందిన నటి. ఈమె కేవలం నటనకే పరిమితం కాకుండా,నృత్య కారిణిగా,  ప్రచారకర్తగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.అంతే కాకుండా తమిళ్ కన్నడ తెలుగు భాషలలో నటించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది.  మొట్టమొదటిసారిగా 2014వ  సంవత్సరంలో " తిరుమనం ఎనుం నిఖా" అనే సినిమా ద్వారా తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో కన్నడ సినీ ఇండస్ట్రీ లో కూడా "అధ్యక్ష" సినిమా ద్వారా పరిచయం అయింది. అయితే మొదట తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కన్నడ సినిమా అధ్యక్ష ముందుగా రిలీజ్ అయింది.

కేవలం ఒకే సంవత్సరంలోనే మూడు ఇండస్ట్రీల లోకి అడుగుపెట్టిన హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.మరోసారి అదే సంవత్సరంలో "అలా ఎలా? " సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం గమనార్హం.అయితే ఈ సినిమా హెబ్బా పటేల్ కు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయినప్పటికీ 2015 సంవత్సరంలో వచ్చిన "కుమారి 21ఎఫ్" హెబ్బా పటేల్ జీవితాన్ని తిరగరాసింది. ఈ సినిమా ద్వారా ఆమె వరుసగా 13 సినిమాల్లో నటించడానికి ఛాన్స్ కొట్టేసింది.

హెబ్బాపటేల్ నటించిన 13 సినిమాలు కూడా ఆమెకు విజయాన్ని చేకూర్చలేదు.చూడదగ్గ అందం, మంచి అభినయంతో కలగలిసినప్పటికీ హెబ్బా పటేల్కు మాత్రం అదృష్టం వరించలేదు.ఆ తరువాత 2016 సంవత్సరం లో "ఎక్కడికి పోతావు చిన్నవాడా "సినిమా ఒక రకంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.  అయితే మరోసారి 2020 వ సంవత్సరంలో వచ్చిన "ఒరేయ్ బుజ్జిగా" సినిమా కూడా పెద్ద అదృష్టాన్ని ఇవ్వలేదు. ఏది ఏమైనా  తన అందంతో ఎప్పటికప్పుడు సినిమాలను అంటిపెట్టుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ ముద్దుల గుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: