సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ,యువన్ శంకర్ రాజా సంగీతం సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ,యువన్ శంకర్ రాజా సంగీతం ఎడిటింగ్ ,చిత్ర నిడివి ,పాత్రల తీరు తెన్నులు ,డైలాగ్స్ ,కథనం ,సాగదీసిన కథనం

తన అన్నయ్య రాజు/ రాజు భాయ్(సూర్య) ని వెతుక్కుంటూ వైజాగ్ నుండి ముంబై చేరుకుంటాడు కృష్ణ(సూర్య). ముంబై కి వచ్చి తన అన్నయ్య రాజు గురించి విచారిస్తుండగా అతను అనుకోని సంఘటనలు వినాల్సి వస్తుంది. రాజు భాయ్, అంధేరీ ప్రాంతానికి అధిపతి , అతను అనుకుంటే చెయ్యలేని పని అంటూ ఉండదు. అతను మరియు చంద్రు(విద్యుత్ జమ్వాల్) కలిసి ముంబై అంధేరీ ప్రాంతంలో మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఇలా జరిగిన ఒక గొడవలో రాజు కి జీవ(సమంత) పరిచయం అవుతుంది. ముందు స్నేహంగానే మొదలయినా వీరి మధ్య ప్రేమ కూడా చిగురిస్తుంది. ఇదిలా జరుగుతుండగా ఒకానొక పరిస్థితిలో వీరిద్దరూ ఇమ్రాన్ భాయ్(మనోజ్ బాజ్పాయ్) తో వైరం పెట్టుకుంటారు. ఆ తరువాత ఎం జరిగింది? రాజు భాయ్ ఏమయ్యాడు? కృష్ణ రాజు భాయ్ ని కలిసాడా? లేదా ? అన్నదే మిగిలిన కథ ...

సూర్య ఎప్పటిలానే ఈ పాత్ర మీద తన ప్రాణం పెట్టి చేసారు కాని పూర్తిగా అభివృద్ధి చెందని పాత్రని ఈ నటుడు ఎంత ఎలివేట్ చెయ్యాలని ప్రయత్నించినా సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు. పైగా రెండవ అర్ధ భాగంలో ఈయన పాత్ర మరింత ఇరుకు అయిపోతుంది. సమంత కి నటించే అవసరం లేకుండా పోయింది చాలా కొద్ది సన్నివేశాలకు మరియు పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది , కాని ఎప్పుడు లేని విధంగా ఈ చిత్రంలో సమంత అందాలను ఆరబోసింది. విద్యుత్ జమ్వాల్ నటన చాలా బాగుంది అతని స్క్రీన్ ప్రేజేన్స్ ఎప్పటిలానే ఆకట్టుకుంది కాని ఆ పాత్రకి తగ్గట్టుగా తనని తాను మరింత మలచుకొని ఉండాల్సింది. ఇతని పాత్ర కూడా పూర్తిగా అభివృద్ధి చేసిన పాత్రలా అనిపించదు.. విలన్ గా మనోజ్ బాజ్పాయి చేసింది చాలా చిన్న పాత్ర, ఆ పాత్రకి ఏదయితే కావాలో దానికి న్యాయం చేసారు. సూరి మరియు బ్రహ్మానందం పండించాలని ప్రయత్నించిన కామెడీ సఫలం అవ్వలేదు. మిగిలిన నటులందరు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.. మరియం జకారియా మరియు చిత్రాంగద సింగ్ ఐటెం సాంగ్స్ లో వారి అందాలతో ఆకట్టుకున్నారు...

కథా పరంగా ఇది గతంలో వచ్చిన పలు చిత్రాలను పోలి ఉంటుంది చాలా చిత్రాలను కలిపి ఒక చిత్రంగా మలిచారు. ఇక కథనం విషయానికి వస్తే చాలా వీక్ కథనం ఈ చిత్రాన్ని మరింత దారుణంగా తయారు చేసింది. ప్రతి సన్నివేశం మొదలయ్యేప్పుడు ఆసక్తికరంగానే మొదలవుతుంది కాని చివరికి వచ్చేసరికి అది ఎలా ముగుస్తుందో మనం ఊహించేయడం చాలా సులభం ఇలా ప్రతి సన్నివేశం సాగుతుంది. పైగా సూర్య ని డాన్ అంటున్నారు కాని ఆ పాత్ర నిజంగా డాన్ అని నమ్మించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నాలన్నీ ఘోరమయిన విఫలాలు ఇవన్ని చాలవు అన్నట్టు ఎందుకోస్తాయో తెలియని పాటలు పైగా అప్పటికే అర్ధం అయిపోయిన విషయాన్నీ పదే పదే చెప్పడం విసుగు పుట్టించే విషయం. ఈ చిత్రం చూసిన తరువాత గతంలో రన్ , పందెం కోడి వంటి చిత్రాలు తెరకేక్కించింది లింగు స్వామి అనే దర్శకుడేనా అని సందేహం కచ్చితంగా వస్తుంది . దర్శకుడిగా లింగు స్వామికి ఘోరమయిన వైఫల్యం ఈ చిత్రం అని చెప్పుకోవచ్చు. శశాంక్ వెన్నెలకంటి రచించిన మాటలు ఆకట్టుకోలేకపోయింది పాత్రలలో ఉన్న పవర్ ఇతని డైలాగ్స్ లో లేకుండాపోయింది. సంతోష్ శ్రీనివాసన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటి , యువన్ శంకర్ రాజ అందించిన సంగీతంలో పాటలు పరవలేధనిపించినా నేపధ్య సంగీతంలో చాలా ఆకట్టుకున్నారు చాలా సన్నివేశాలు ఆకట్టుకోలేకపోయినా అక్కడ వచ్చిన నేపధ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంది.. ఎడిటర్ , ఇచ్చిన ఫుటేజ్ ని ఒక క్రమంలో పెట్టి ఇచేసినట్టు అనిపిస్తుంది ఒక్క సన్నివేశం కూడా సున్నితంగా ముగిసిన భావన కలగదు.. ఈ చిత్రంలో దాదాపు ముప్పై నిమిషాల చిత్రం కత్తిరించినా చిత్రానికి వచ్చే అపాయం ఏమి లేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి..

ఒక చిత్రం ఎలా ముగిస్తాడా అని వేచి చూడటానికి ఎప్పుడు అయిపోనిస్తాడా అని వేచి చూడటానికి గల తేడా తెలియాలంటే ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలి ఎందుకంటే చిత్రం ఎలా ముగిస్తాడో ముందే తెలిసిపోయినా కూడా ఎప్పుడు ముగిస్తాడో అని గంటల, వారాలా, సంవత్సరాల, పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఈ చిత్ర నిడివి అక్షరాలా నూట డబ్బై నిమిషాలు అంటే పది నిముషాలు తక్కువ మూడు గంటలు కాని చిత్ర కథా సామర్ధ్యం ముప్పై నిమిషాలు ఇంత తక్కువ సామర్ధ్యం ఉన్న కథని పట్టి లాగి సాగదీసి చిత్రం తీస్తే ఎలా ఉంటుంది అంటే సికిందర్ లా ఉంటుంది.. ఈ చిత్రం మొదలయినప్పుడు ఏదో ఆసక్తికరంగా మొదలయ్యింది అనుకుంటాము మెల్లగా ఆసక్తికరం కాస్త అనాసక్తికరంగా మారి చివరికి నీరసం అయ్యి విరక్తితో ముగుస్తుంది. ఒక కథని ఆసక్తికరంగా ఎన్ని గంటలు చెప్పినా వినగలం కాని అసలు ఆసక్తి సృష్టించలేని ఒక పంథాను ఎంచుకొని అందులో కథను మొదలుపెట్టి ఒక సన్నివేశం చెప్పి అది అర్ధం అయ్యేవరకు పదే పదే ఉపమానాలు ఇస్తూ మళ్ళీ అదే కథ చెప్తూ మళ్ళీ ఉపమానాలు ఇస్తూ ఇలా సాగింది సికిందర్..

రెండవ అర్ధ భాగం మొత్తం కథ ఒకే చోట నిలబడింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోండి.. సెంటిమెంట్ సన్నివేశం మొదలు పెట్టి అందులో యాక్షన్ జోప్ప్పించాలన్న ప్రయత్నం వెంటనే కామెడీ పండించాలన్న తాపత్రయం ఇటు సెంటిమెంట్ ని సరిగ్గా ముగించలేక అటు యాక్షన్ ని సరిగ్గా చూపించలేక, కామెడీ పండించలేక ప్రేక్షకులను విసుగు చెందేలా చేసాడు దర్శకుడు. ఇదే కథను ఇంకోలా చెప్పి ఉంటె అద్భుతమయిన చిత్రం అయ్యి ఉండేది కాని ఈ చిత్రంలో నేరేషన్ విధానం చిత్రానికి చాలా మైనస్, హీరో ని ఎలివేట్ చెయ్యలేకపోయింది , సూర్య - సామంత బంధాన్ని లేదా సూర్య - విద్యుత్ బంధాన్ని ఇలా దేన్ని కూడా పూర్తి స్థాయిలో అర్ధం అయ్యేలా చెప్పలేకపోయింది ఈ నేరేషన్ విధానం. చిత్రంలో ఒక్క నిమిషంలో సగం కూడా ప్రేక్షకుడిలో ఆసక్తి సృష్టించలేకపోయిన చిత్రంగా సికిందర్ చరిత్రలో నిలిచిపోతుంది... ఇంత చదివాక మీరు చూడాలి అనుకుంటే మీ ఇష్టం కాని మేము థియేటర్ నుండి బయటకు వచ్చేప్పుడు ఒక ఔత్సాహికుడు అన్న మాట ఇది ...

"నూట డబ్బై నిమిషాల కఠిన కారాగార శిక్ష తరువాత విడుదలయిన ఖైది లా ఉంది నా పరిస్థితి ..."

ఇది విన్నాక కూడా మీరు వెళ్ళాలి అనుకుంటే మీ ఇష్టం...

Surya,Samantha,N. Linguswamy,Siddharth Roy Kapur,Yuvan Shankar Raja.సికందర్ - "సిక్" అందర్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: