కలుసుకోవాలని, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి, ఎవడు, రేసుగుర్రం వంటి పలు సినిమాలకు కథా రచన చేసిన వక్కంతం వంశీ ఆ సినిమాలతో మంచి పేరు దక్కించుకున్నారు. అనంతరం ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ద్వారా తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు వంశీ. అను ఇమ్మానియేల్ హీరోయిన్ నటించిన ఆ సినిమా లో శరత్ కుమార్ విలన్ గా నటించగా అర్జున్ సర్జా, అల్లు అర్జున్ కి తండ్రిగా నటించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సోల్జర్ సూర్య గా అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఇందులోని సాంగ్స్ కూడా శ్రోతల నుంచి విశేషమైన స్పందన అందుకున్నాయి. ఇక ఈ మూవీ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వక్కంతం వంశీ అతి త్వరలో తన రెండో సినిమాని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల రంగ్ దే తో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ హీరోగా వక్కంతం వంశీ సెకండ్ మూవీ తెరకెక్కనుందని ఇప్పటికైనా నితిన్ కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించిన వంశీ అది ఆయనకు ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని యొక్క పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని అంటున్నారు.

మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంతో భారీ వ్యయంతో నిర్మించనుందట. అతి త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని సమాచారం. మరి ఈ సినిమా వక్కంతం వంశీకి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: