చిత్ర పరిశ్రమకు చాల మంది నటులు పరిచయం అవుతుంటారు. వారిలో కొంత మందికి మాత్రమే సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక కొంత మంది నటులు వెండితెరపై కనువిందు చేస్తూనే కొన్ని సార్లు బుల్లితెరపై కూడా కనువిందు చేస్తుంటారు. మరికొంత మంది ఏడాదికి ఒక్కసారి వచ్చే సినిమాలో కనిపించడం కంటే.. బుల్లితెరపై ప్రతి రోజు ప్రేక్షకులను అలరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు.

ప్రస్తుతం సినిమా రంగానికి ఎంతటి పేరుందో, టివి రంగానికి కూడా అంతే క్రేజ్ ఉంది. ఇక వెండితెరపై మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న నటులు సైతం బుల్లితెరపై చుపించాడనికి ఆసక్తి చూపిస్తున్నారు.  అంతేకాదు.. టివిలో నిత్యం కనిపించడం వలన ఆడియన్స్ కి మరింత దగ్గరగా కనిపిస్తున్నారు. అందుకే చాలామంది వెండితెరనుంచి బుల్లితెరకు షిఫ్ట్ అవుతున్నారు. శంకరాభరణం సినిమాతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న మంజు భార్గవి ఆతర్వాత కొన్ని సినిమాలు చేశారు.

అయితే అలీతో కల్సి యమలీల సినిమాలో తల్లి పాత్ర పోషించిన మంజుభార్గవి ప్రస్తుతం యమలీల సీరియల్ లో బుల్లితెర మీద తన నటనతో అలరిస్తున్నారు. పలు సినిమాల్లో చేసిన కస్తూరి కూడా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తోంది. అరవింద సమేత సీరియల్ లో నటి సన నటిస్తోంది. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో బెంగుళూరు పద్మ నటిస్తున్నారు.

ఇక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన నటనతో అలరిస్తున్న రమ్యకృష్ణ బుల్లితెరమీద నాగభైరవి సీరియల్ లో చేస్తుంది. అంతేకాక ఒకప్పటి బాలనటి, స్టార్ హీరోయిన్ రాశి కూడా జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తోంది. ఇక నటి జయలలిత ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటిస్తుంది. నటి భావన గురించి తెలియని వార్తు ఉండరు. ఆమె ప్రస్తుతం కల్యాణ వైభోగం, యమలీల సీరియల్స్ లో చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: