
పుణ్యభూమి నాదేశం అనే పాట ఇప్పటికీ టీవీ లో వస్తుంటే కళ్ళార్పకుండా చూస్తారు.. ఈనేపథ్యంలో ఈ సినిమా సాధించిన రికార్డులను ఇప్పుడు చూద్దాం.. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ఈ సినిమాని నిర్మించగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలువగా, అప్పటివరకు ఉన్న సినిమా రికార్డులన్నింటిని క్రాస్ చేసింది ఈ సినిమా.. ఎన్టీఆర్ సరసన శారద, మోహన్ బాబు సరసన నగ్మా, రమ్యకృష్ణ నటించారు.. ఏప్రిల్ 23, 1993 వ సంవత్సరంలో ఈ సినిమా విడుదల కాగా 29 వసంతంలోకి అడుగుపెట్టింది ఈ సినిమా.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన భార్య బసవతారకం మెడికల్ ట్రస్ట్ బిల్డింగ్ కోసం.. అందుకే బయటి సినిమా చేయాలి అనుకుంటున్న అని మీడియాకు వెల్లడించారు..
దీంతో మోహన్ బాబు మీతోనే సినిమా చేస్తానంటూ అన్నగారి డేట్స్ తీసుకున్నారు.. అలా ఈ సినిమాకు అంకురార్పణ జరిగింది.. పరుచూరి బ్రదర్స్ తో ఈ సినిమా స్టోరీ రెడీ చేయించి 1992 నవంబర్ 20న పూజ కార్యక్రమాలతో సినిమా ని మొదలుపెట్టారు.. 1993 వ సంవత్సరం లోనే హైయెస్ట్ గ్రాసర్ ఈ సినిమా నిలిచింది.. ఎన్టీఆర్ హీరోగా నటించిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ అయితే థియేటర్స్ లో విడుదలైన లాస్ట్ చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు.. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 12 చిత్రం కాగా, ఈ సినిమా వంద రోజుల వేడుక తిరుపతి లో జరిగింది.. అన్నగారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ ఫంక్షన్ లోనే వెల్లడించారు..