సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు కొన్ని సినిమాలు చేశాక పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. యవ్వన వయస్సులో సినిమాల్లోకి వచ్చి వీలైనన్ని సినిమాలు చేసి కావాల్సినంత సంపాదించి ఓ వయసు రాగానే పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటారు. కెరీర్ ఊపు లో ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించరు కానీ పెళ్లి గురించి ఆలోచిస్తే మాత్రం కెరియర్ గురించి పట్టించుకోరు.  కాస్త ఆలస్యంగా అయినా పెళ్లి చేసుకుంటారు కానీ సినిమా కెరీర్ బాగా ఉన్నప్పుడు మాత్రం అసలు పెళ్లి గురించి ఆలోచించరు.

ఇటీవలే మన టాలీవుడ్ హీరోయిన్ లు కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. కాగా ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ల గురించి మనం తెలుసుకుందాం. కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ మెహరీన్ పంజాబ్ కు చెందిన ఓ పొలిటికల్ లీడర్ తనయుడు భవ్య భిష్ణోయ్ ను త్వరలోనే వివాహం చేసుకుంది. సెకండ్ వేవ్ కారణంగా వీరి పెళ్లి కి బ్రేక్ పడింది లేదంటే ఇప్పటికే పెళ్లి అయిపోయేది. తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన అవికాగోర్ కూడా త్వరలోనే పెళ్లికూతురు కాబోతుంది. ఓ అడ్వెంచర్ షో లో పార్టిసిపేట్ చేస్తున్న మిలింద్ చద్వాని తో ప్రేమ లో ఉండగా వచ్చే ఏడాది ఈమె పెళ్లి పీట లెక్కనున్నట్లు తెలుస్తోంది.

కమల్ హాసన్ కూతురు  శృతి హాసన్ కూడా తన కొత్త ప్రియుడు శంతను హజారికా ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా ఇటీవల శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార త్వరలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కాగా గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతుండగా సోషల్ మీడియాలో వారిద్దరూ చేసే షికార్లకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికి హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ ని తమ సినిమాలతో ఏలిన ఈ హీరోయిన్లు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అభిమానుల్లో మంచి సంతోషాన్ని నింపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: