నందమూరి బాలకృష్ణ పుట్టినరోజునాడు హంగామా చేయాలని కలలు కన్న అభిమానుల ఆశలు నీరుకారిపోయాయి అన్నమాటలు వినిపిస్తున్నాయి. నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా బాలకృష్ణ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నట్లు ఆయనకు చెందిన ఎన్బీకే ఫిల్మ్స్ ప్రకటించడంతో ఆ ప్రకటన చూసి అభిమానులు బాలయ్య నుండి ఎదో కీలక ప్రకటన ఉంటుంది అని కలలు కన్నారు.


మరికొందరు అభిమానులు అయితే ఈ ప్రకటన చూసి మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి ఎదో ఒక అప్ డేట్ ఉంటుంది అన్న ఊహాగానాలు కూడ మొదలైపోయాయి. అయితే కొద్ది సేపటికి ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా బాలకృష్ణ తాను స్వయంగా పాడిన ‘శ్రీరామ దండకం’ ను ఆయన లక్కీ నెంబర్ 9 కలిసి వచ్చేలా ఈరోజు ఉదయం 9.45 నిమిషాలకు విడుదల  చేస్తున్నట్లు ప్రకటించాడు.  




ఈప్రకటన చూసి అభిమానుల ఉత్సాహం నీరుకారి పోయింది. బాలయ్య తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఏమన్నా క్లారిటీ ఇస్తాడు అనుకుంటే ఇప్పుడు ఈ శ్రీరామ దండకం హడావిడి ఏమిటి అంటూ అభిమానులు నిట్టూర్పులు విడిచినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా ఉపద్రవాన్ని తట్టుకోవాలి అంటే ప్రతిరోజు గాయత్రి మంత్రం చదువుకుంటే చాలు ఎటువంటి సమస్యలు రావు అని బాలయ్య గతంలో ఓపెన్ గానే చెప్పాడు. ఇప్పడు సెకండ్ వేవ్ తో జనం అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో రక్షగా ఈ  శ్రీరామ దండకాన్ని బాలయ్య ప్రయోగిస్తున్నాడు అనుకోవాలి.  


ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ‘అఖండ’ తో తమ హీరూ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా హీరోగా సెటిల్ అవ్వకపోతే తాను సంగీత కళాకారుడుగా రాణించే వాడినని తనకు వైలెన్ వాయించడం కూడ వచ్చని గతంలో బాలయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే బాలయ్యను జనం మాస్ హీరోగా అభిమానిస్తూ ఉండటంతో తన సినిమాలు కొనసాగిస్తూనే ఇలా మధ్యమధ్యలో సంగీతం పై తనకు ఉన్న అభిరుచిని చాటుకుంటున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: