తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. కుటుంబాల మధ్య భావోద్వేగాలు,ఆప్యాయతలు, అనుబంధాలను ఎంతో బాగా చూపించారు మన తెలుగు దర్శకులు.  తెలుగు లో కుటుంబ కథా చిత్రం వస్తుందంటే చాలు ప్రేక్షకులు కంటతడి పెట్టించే సన్నివేశాలు ఈ సినిమాలలో ఎన్నో ఉంటాయని అనుకునేవారు. ప్రతి హీరో కూడా ఈ తరహా లో ఒక సినిమా చేసి తన కెరియర్ ను పరిపూర్ణం చేసుకోవాలి  ఆలోచిస్తాడు.

అలా రామ్ చరణ్ తేజ్ అప్పటి వరకు మాస్ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ రాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే సినిమా ఆయన కుటుంబ కథా చిత్రం చేయాలన్న కోరిక నెరవేరింది. 2014 అక్టోబర్ 1 న విడుదలైన ఈ సినిమాలో కాజల్ కథానాయిక గా నటించగా శ్రీకాంత్ , కమలిని ముఖర్జీ జంటగా నటించారు.   భానుశ్రీ మెహ్రా, ప్రకాష్ రాజ్ , జయసుధ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా  మంచి విజయం సాధించింది. రామ్ చరణ్ కెరీర్లోనే మంచి చిత్రంగా నిలిచింది.

సినిమా విడుదల సమయంలో చాలాసార్లు దర్శకుడు కృష్ణ వంశీసినిమా కథకు పాక్షికంగా అక్కినేని నాగేశ్వరరావు మీనా కలిసి నటించిన సీతారామయ్యగారి మనవరాలు స్ఫూర్తి అని చెప్పారు. ఆ సినిమాలో తాత కోసం మనవరాలు వస్తే ఈ సినిమాలో తాత కోసం మనవడు వచ్చి విడిపోయిన తన తండ్రిని వారితో కలుపుతాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా సంగీత పరంగా ప్రేక్షకులను కొంత నిరుత్సాహ పరిచింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కృష్ణవంశీ సినిమాలంటే సంగీత సాహిత్యాలకు నిర్ణయం గా ఉంటాయి అయితే ఈ సినిమా పాటలు ఆ స్థాయిలో లేవని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: