పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడవ సినిమా అజ్ఞాతవాసి. అంతకముందు పవన్ తో త్రివిక్రమ్, జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు చేసారు. అయితే ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా, అజ్ఞాతవాసి మూవీ మాత్రం భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా యాక్ట్ చేసారు.
అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ, తనికెళ్ళ భరణి, కుష్బూ, శ్రీనివాస రెడ్డి తదితరులు ఇతర పాత్రలు చేసారు. ఆస్థి కోసం తండిని, తమ్ముడిని హతమార్చిన దుండగుల కోసం ఎవరికీ తెలియకుండా ఎక్కడో దూరంగా పెరుగుతున్న కొడుకుని రప్పించిన తల్లి, అతడి ద్వారా చివరికి ఆ దుండగులను అంతమయ్యేలా చేస్తుంది. స్టోరీ పరంగా బాగున్నప్పటికీ దీనిని స్క్రీన్ పై ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు త్రివిక్రమ్ విఫలం అయ్యారని పలువురు ఆడియన్స్ అప్పట్లో ఈ మూవీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
అలానే అంతకముందు ఫ్రెంచ్ లో వచ్చిన లార్గో వించ్ అనే మూవీకి కాపీగా అజ్ఞాతవాసి తెరకెక్కిందని, త్రివిక్రమ్మూవీ స్టోరీ నే మక్కికి మక్కి దింపారు అంటూ అప్పట్లో మరికొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఈ సినిమాలోని కీలకమైన ఒక ఫైట్ తరువాత వచ్చే సన్నివేశంలో పోలీస్ అధికారికగా విక్టరీ వెంకటేష్ కొన్ని క్షణాలు కనిపిస్తారు. ఆ రోల్ చిన్నదే అయినప్పటికీ వెంకీ తన మార్క్ కామెడీ డైలాగ్స్ తో అదరగొడతారు. ఆ సీన్ కి థియేటర్స్ విజిల్స్ తో మారుమ్రోగిపోయాయి అనే చెప్పాలి. అయితే అంతకముందు వెంకటేష్, పవన్ కలిసి గోపాల గోపాల మూవీలో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: