క్రికెటర్ ల కు హీరోయిన్ లకు మధ్య లవ్ ఎఫైర్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పటినుంచో ఉంటున్నది. గతంలో చాలా మంది హీరోయిన్ లు క్రికెటర్ల మోజులో పడి వారిని ప్రేమించారు. ఇందులో చాలామంది విజయవంతమైన ఎంతోమంది విఫలం అయ్యారు. క్రికెటర్లను పెళ్లి చేసుకోవాలనుకునే వారి కలలు విచ్చిన్నమయ్యాయి. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ ల తో క్రికెటర్లు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అలా భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ షర్మిల ఠాకూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇద్దరూ ఒకటయ్యారు.

అయితే చాలా మంది క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమాయణం చేసినప్పటికీ కొంతమంది మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్లారు. చాలామంది విడిపోయారు. అలాంటి జంట లో ఒక జంట గంగూలీ మరియు నగ్మా జంట. అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని మీడియా కోడై కూసింది. సోషల్ మీడియా లేకున్నా వైరల్ అయ్యింది. అప్పటికే గంగూలీ డోనా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అలాంటి గంగూలీ హీరోయిన్ తో ప్రేమలో పడడం ఎంటా అనుకున్నారు. అందులోనూ నగ్మా అనేసరికి అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది.

తన అందచందాలతో ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ హీరోయిన్ నగ్మా క్రికెటర్ తో ప్రేమలో పడడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలుగు హిందీ కన్నడ బోజ్ పూరి, బెంగాలీ,పంజాబీ మరాఠీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నది నగ్మా. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నా ఆమె గంగూలీతో ప్రేమలో పడడం ఎంతో సెన్సేషన్ అయ్యింది. సీక్రెట్ గా డేటింగ్ లు చేస్తూ పబ్బులు పార్టీలు అంటూ షికార్లు చేసేవారట. 1999 వరల్డ్ కప్ సమయంలో ఈ అఫైర్ ఒక్కసారిగా బట్టబయలు అయింది. ఓ మ్యాచ్ లో వీరిద్దరు జంటగా వెళ్లి ఫోటోలు దిగడంతో వీరిమధ్య ఎఫైర్ ఉందని ఆజ్యం పోసినట్లు అయ్యింది. వీరిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వీరు విడిపోవాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: