ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా రావాలంటే ఎన్నో రకాల దారులు ఉన్నాయి. సోషల్ మీడియాను దారి గా చేసుకుని ఎంతో మంది నటీనటులు పరిచయమవుతూ స్టార్ స్టేటస్ కు చేరుకుంటున్నారు. అలా కొత్త దారి లో స్టార్ట్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి సువర్ణ అవకాశాలు నటీనటులకు సాంకేతిక నిపుణులకు ఉండేది కాదు. సినిమాల్లోకి రావాలంటే చాన్సు పొందాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో ఫేమస్ ఐనా నటీనటులుగా సాంకేతిక నిపుణులుగా ఎదుగుతున్నారు.

ఆ విధంగా టాలీవుడ్ లో సోషల్ మీడియా లో పాపులర్ అయ్యి ఇమేజ్ సాధించి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి స్టార్ గా ఎదిగిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో స్టార్ గా మంచి మంచి సినిమా అవకాశాలను పొందిన హీరో రాజ్ తరుణ్తొలుత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు సంపాదించి ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోగా మారి ఆ తర్వాత సినిమా చూపిస్త మామ కుమారి 21ఎఫ్ సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ ఎంతో సాఫీగా సాగుతోంది.

ఇటీవలే కలర్ ఫోటో సినిమా ద్వారా హీరోయిన్ గా అందరికీ పరిచయమైన కథానాయిక చాందిని అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకులను తన అందచందాలతో హావభావాలతో అలరించింది. ప్రస్తుతం పెద్ద పెద్ద అవకాశాలన్ని పొందుతూ స్టార్ హీరోయిన్ అయ్యేదానికి రేస్ లో ఉంది. యూట్యూబ్ లో కామెడీ బిట్స్ చేసుకుంటూ కమెడియన్ గా మంచి పేరు సంపాదించి ఆ తర్వాత సినిమాల్లో మంచి మంచి అవకాశాలు పొందాడు హర్ష. ఈయన చేసిన వైవా అనే షార్ట్ ఫిలిం ఎంతగానో హిట్టవడంతో ఆ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన దర్శకుడు అనుదీప్ అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రతిభను చాటుకున్నాడు. ఆ షార్ట్ ఫిలిమ్స్ ను చూసి నిర్మాతలు ఆయనకు ఈ అవకాశం ఇచ్చారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: