టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్స్ టీజర్స్, అలానే ఇటీవల రిలీజ్ అయిన మేకింగ్ వీడియో అన్ని కూడా ఆడియన్స్ లో సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేసాయి. ముఖ్యంగా మేకింగ్ వీడియో బయటకు వచ్చిన తరువాత ఈ సినిమా ఎంత పెద్ద లెవెల్లో రూపొందుతోంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కి కొంత వరకు క్లారిటీ వచ్చింది. కొన్ని ప్రఖ్యాత హాలీవుడ్ సంస్థలు ఈ మూవీకి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తుండగా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు రాజమౌళిసినిమా తెరకెక్కించినట్లు సమాచారం.

మేకింగ్ లో విజువల్స్ కి అందరి నుండి మంచి ప్రసంసలు వస్తుండడంతో ఈ మాత్రం దానికే ఇలా అయిపోతే లోపల ఇంకెన్నో అద్భుతాలు దాచి ఉంచారని, రేపు సినిమా విడుదల తరువాత ప్రతి ఒక్కరు మూవీ గురించి మరింత గొప్పగా మాట్లాడుకుంటారని అంటోందట యూనిట్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వంటి పలు చిత్ర పరిశ్రమలకు చెందిన అనేకమంది నటులు ఇందులో ముఖ్య పాత్రలు చేస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. కాగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. మరి విడుదల తరువాత ఆర్ఆర్ఆర్ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.... !!


మరింత సమాచారం తెలుసుకోండి: