సంసారం.. ఈ పదం ఎవరు పెట్టారో తెలియదు కానీ.. సంసారం అనగానే బరువు , బాధ్యత ,భర్త ,భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఇలా ప్రతి ఒక్కరు ఒకే కుటుంబంలో కలసిమెలసి జీవించాలి అనేది దీని సారాంశం.. సుఖమైనా ,కష్టమైనా , లాభ మైన , నష్టమైన కలసి పంచుకోవడమే జీవితం.. ఇటీవల కాలంలో చాలామంది పెళ్ళయిన వెంటనే విడిగా కాపురం పెట్టాలి.. ఎవరి అండ అవసరం లేదు.. మాకు మేము సంతోషంగా బ్రతక గలము అనుకుంటూ తల్లిదండ్రుల నుంచి విడిపోతూ ఉంటారు.. కానీ సమస్యలు వచ్చినప్పుడు తెలుస్తుంది.. కుటుంబం ఉంటే ఎంత బాగుండేదో తోడుగా అంటూ.. నిజం చెప్పాలి అంటే," సంసారం ఈదడం కంటే ఒక సముద్రాన్ని ఈదడం సులభం" అని అప్పట్లో పెద్ద వాళ్ళు చెప్పే వాళ్ళు.. ఒక సంసారాన్ని చక్కగా నడపాలి అంటే ఇంట్లో ఉన్న ఆడ వాళ్లకు ఎంతో సహనం ఉంటుందో, మగవాళ్ళు కూడా అంతే సమానంగా, శ్రద్ధగా కుటుంబాన్ని ముందుకు నడిపించాలని ఉంటుంది..

ఈ విషయాలన్నింటిని చక్కగా తెరకెక్కించారు సంసారం ఒక చదరంగం అనే సినిమా రూపంలో..  సంసారం అనేది ఒక చదరంగం లాంటిది.. చదరంగం లో మనం పావులు సరైన సమయానికి కదప లేకపోతే.. శత్రువులు రాజును చుట్టుముట్టడం జరుగుతుంది.. కాబట్టి ఎంతో తెలివిగా, చదరంగంలో పావులు కదిపినట్టు సంసారాన్ని కూడా అంతే తెలివిగా ముందుకు తీసుకు వెళ్ళాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరి లో ఉండాలి.. అప్పుడే నలుగురిలో గౌరవ మర్యాదలతో ,ఇంట్లో సుఖ సంతోషాలతో ఆ కుటుంబం ఎల్లవేళలా తులతూగుతూ ఉంటుంది..

సంసారం గురించి ఎంతో అద్భుతంగా వివరించిన ప్రముఖ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్, ఇలాంటి సినిమా కథలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి.. ఇక గొల్లపూడి మారుతీ రావు నటన ఈ సినిమాకు అమోఘం.. ఆయన వాక్చాతుర్యం, నటన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.. ఇక అన్నపూర్ణమ్మగారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆమె ఏ పాత్ర కు వేషం కడితే ఆ పాత్రలో లీనమైపోయి నటించేస్తుంది. శరత్ బాబు, సుహాసిని ,రాజేంద్రప్రసాద్ వీళ్లంతా కూడా సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా నిజానికి 1986లో తమిళంలో విడుదలైన సంసారం అడు మిన్సారం అనే సినిమా నుంచి తెలుగులో రీమేక్ చేయడం జరిగింది.

సినిమా ఏకంగా మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక ఉత్తమ బాల నటుడిగా మాస్టర్ శ్రావణ్ కుమార్, ఉత్తమ సహాయ నటిగా షావుకారు జానకి, ఉత్తమ కథా రచయితగా విసు లు నంది అవార్డులు గెలుచుకోవడం గమనార్హం. ఇక కుటుంబాలకు.. కుటుంబాలు సినిమా థియేటర్లకు వెళ్లి ఈ సినిమాలు చూడడం అప్పట్లో హాట్  టాపిక్ గా మారింది. ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది ఈ సినిమా.


మరింత సమాచారం తెలుసుకోండి: