సినిమాలు అంటేనే ఎక్కువగా యాక్షన్ , ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చేవి ..అందులో ముఖ్యంగా ఆ సినిమాలు హిట్ కావాలి అంటే తప్పకుండా ఒక ఐటమ్ సాంగ్ వుండి తీరాల్సిందే. ముఖ్యంగా ఆనాటి కాలంలో ఐటమ్ సాంగ్ లకు పెట్టింది పేరు జ్యోతిలక్ష్మి , సిల్క్ స్మిత.. వీరు స్టేజ్ మీద కనిపిస్తే చాలు కుర్రకారు నుంచి ముసలి వాళ్ళ వరకు ఉర్రూతలూగుతూ ఉంటారు. అలా అప్పట్లో కొన్ని కొన్ని ఐటమ్ సాంగులతో సినిమాలో హైలెట్ గా నిలిచి, ఆ పాటలను అక్కడ.. అక్కడ..ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటారు. ఇక అలాంటి పాటలలో ఇప్పటికీ కుర్రకారుకు ఏ మాత్రం నిద్ర లేకుండా చేస్తూ ఉర్రూతలూగిస్తున్న పాట "బావల సయ్య.. మరదలు సయ్యా.. రింగోల.. రింగోల.. రింగోళ..


ఈ పాట కృష్ణంరాజు బావగా, సుమన్ బామ్మర్ది గా తెరకెక్కిన చిత్రం బావ బామ్మర్ది.. ఈ సినిమాలో సుమన్ కి అక్క గా జయసుధ నటించింది.నిర్మలమ్మ వీరికి తల్లిగా నటించింది.. ఒక బావ మీద బామ్మర్ది ఎంత విశ్వాసం గా ఉంటాడు.. ఒక వేశ్య వలలో చిక్కుకున్న బావను మార్చి తన అక్క కాపురాన్ని తీర్చిదిద్దిన ఒక బావమరిది కథ అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు హైలెట్ సిల్క్ స్మిత అని చెప్పవచ్చు.. మాలాశ్రీ హీరోయిన్ గా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇందులో పాటలకు చక్కగా సంగీతాన్ని అందించారు రాజ్ కోటి..


ఇక ఈ పాట చూడడానికి ఎలా ఉన్నా సరే..వినడానికి మాత్రం చాలా వినసొంపుగా ఉంటుంది.. ఒక వేశ్య మగవాళ్లను తన వైపు తిప్పుకోవడం కోసం సాగే ప్రయత్నంలో పాడే ఈ పాట అర్థం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంది.. కానీ నిజానికి ఇందులో కట్టుకున్న భార్యను వదిలి నా దగ్గరికి వచ్చారు.. నా దగ్గర నుంచి వెళ్ళరు కదా.. కావలసిన అన్ని సౌకర్యాలు చేస్తాను.. నోటు ఇస్తే కావల్సింది ఇస్తా.. అంటూ తర్వాత లాస్ట్ లో ఎవరికి అందని దాని నేను.. అంటూ చెప్తుంది సిల్క్ స్మిత.. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో హీరోల నటన కన్నా సిల్క్ స్మిత నటన చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఈమె వల్లనే, ఈ పాట వల్లనే సినిమా చాలా హైలెట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తే అందరూ ఈ పాట కోసం ఎదురు చూస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: