తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న అగ్ర హీరోలలో బాలకృష్ణ ఒకరు. ఇండస్ట్రీలో బాలకృష్ణ అంటే ఇష్టపడేవారు ఉన్నారు. అలాగే ఆయనంటే భయపడే వారు ఉన్నారు. భయమంటే మీరు అనుకునేది కాదు అండి. ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కొంచెం భయం ఉంటుందిగా అలా అంతే. ఒక నటుడిగా ఎన్నో సినిమాలో నటించి తాను ఏమిటో నిరూపించుకున్నాడు. తాజాగా తెలుగు నటుడు సమీర్ బాలయ్య గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అవేమిటో ఒకసారి తెలుసుకుందాము. బాలయ్య నటించిన "గౌతమి పుత్ర శాతకర్ణి" మూవీలో జరిగిన ఒక షూటింగ్ ఇన్సిడెంట్ గురించి సమీర్ అభిమానులకు తెలియచేశాడు. "గౌతమి పుత్ర శాతకర్ణి" క్లైమాక్స్ షాట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీ లో సమీర్ ఒక సినిమా షూటింగ్ లో ఉన్నారట, అదే సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీ కి పక్కనే బాలయ్య బాబు షూటింగ్ లో ఉన్నారట. అక్కడ జరిగిన ఒక విషయం గురించి సమీర్ తన మాటలలో ఈ విధంగా చెప్పాడు.
సమీర్ మాట్లాడుతూ "నేను సినిమా షూటింగ్ లో ఉండగా, పక్కనే కొంచెం దూరంలో బాలయ్య బాబు సినిమా షూటింగ్ అని తెలుసుకుని చలపతి రావు బాబాయిని అడిగాను. బాబాయ్, బాలయ్య బాబు పక్కనే ఉన్నాడు. మనకు సమయం ఉంటే చూసొద్దాం అని అడిగాను. దీనికి బాబాయ్ కూడా ఓకే ఉన్నారు. తర్వాత మేమిద్దరం డైరెక్టర్ ని అడిగి అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే బాలయ్య బాబు ఏమిటి సమీర్ ఎక్కడ, ఏ షూటింగ్ లో ఉన్నావు అన్న వివరాలు అడిగి తెలుసుకున్నాడు.  అక్కడ గుర్రంపై ఒక షాట్ జరుగుతోంది. గుర్రం మీద బాలయ్య ఉన్నాడు...పైన బాలయ్యకు రోప్ కట్టి ఉన్నారు. కత్తి పట్టుకుని గుర్రం రెండు కాళ్ళు పైకెత్తి ఉంటే షాట్ ఒకే అవుతుంది. కానీ ఆ గుర్రం ఎంత  లాగుతున్నా కాళ్ళు పైకి లేపడం లేదు. చాలా టేక్ లు  తీసుకున్నారు. అయినా షాట్ కంప్లీట్ కావడం లేదు. తర్వాత బాలయ్య విసిగిపోయాడు.
అప్పుడు ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ లను పిలిచి నా రోప్ తీసేయండి అన్నాడు. కానీ మాస్టర్ వద్దు బాబు స్లిప్  అయితే వెనక్కు పడతారు. బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నారు. అయినా బాలయ్య బాబు వినకుండా ముందు రోప్ తీసెయ్యి అన్నాడు. ఆ రోప్ తీసేశాక ఆ గుర్రంపై ఒక్క దెబ్బ వేశాడు. అంతే గుర్రం పైకి ఎక్కాడు.. అంతే సింగిల్ టెక్ లో షాట్ ఓకే అయింది. అందరూ చప్పట్లు కొట్టారు. బాలయ్య రియల్ గా షూట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతయారు.  ఈ విధంగా బాలయ్య వర్కింగ్ స్టైల్ ను అలాగే పని యందు నిబద్దత ను తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: