టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్నతో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. భారీ యాక్షన్, కమర్షియల్ హంగులతో ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా దీనిని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్.

అయితే మరోవైపు బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో కి హోస్ట్ గా కూడా వ్యవహారిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ షోని తన టాలెంట్ తో మరింత క్రేజీ గా ముందుకు నడిపిస్తున్నారు. అయితే త్వరలో కొరటాల శివ తో ఎన్టీఆర్ చేయనున్న నెక్స్ట్ సినిమా పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదిరిపోనుందని టాక్. ఇక మ్యాటర్ ఏమిటంటే, కొద్దిరోజుల క్రితం ప్రారంభం అయిన ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో ఫుల్ గా క్రాఫ్ తో కనపడిన ఎన్టీఆర్, నేటి ఎపిసోడ్ నుండి తన హెయిర్ ని చాలా వరకు కట్ చేసుకుని కొత్తగా కన్పించారు.

కాగా మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన ఈ లేటెస్ట్ హెయిర్ స్టైల్ తదుపరి కొరటాల మూవీ కోసం అని, ఆ పాత్ర రీత్యానే ఎన్టీఆర్ ఈ విధంగా హెయిర్ కట్ చేయించారని అంటున్నాయి సినిమా వర్గాలు. మరి దీనిని బట్టి చూస్తుంటే జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత మరొకసారి ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా అన్నివిధాలా సరికొత్తగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: