ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక నేపథ్య గాయకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా దక్షిణభారతదేశ చిత్రాలలో పని చేసినందుకు మంచి గుర్తింపు లభించింది. ఈయన మొదటి సారిగా 1966వ సంవత్సరంలో వచ్చిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అనే తెలుగు సినిమాకు ప్లే బ్యాక్ సింగర్ గా అడుగు పెట్టాడు.. ఆ తర్వాత సుమారుగా భారత దేశంలోని పలు భాషలలో ఏకంగా 40 వేల పాటలు పాడి రికార్డు సృష్టించారు.. ఈయన జీవితంలో అందుకున్న పురస్కారాలు విషయాల గురించి తెలుసుకుని నట్లయితే ఎవరు సాధించలేని పురస్కారాలు సాధించి , ఇందులో కూడా ఒక రికార్డు నెల కొన్నారు..

1979వ సంవత్సరంలో శంకరాభరణం సినిమాకు ఆయన అందించిన సంగీతానికి గాను జాతీయ పురస్కారాలలో మొదటి జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి చలన చిత్రరంగంలో ఏకంగా 25 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ పురుష నేపథ్యగాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ప్రత్యేక జ్యూరీ అవార్డు తో పాటు ఉత్తమ సహాయనటుడు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు..

ఇక ఉత్తమ పురుష డబ్బింగ్ కళాకారుడిగా కూడా ఆయనకు  అవార్డు లభించింది.. తమిళనాడు సినీ ఇండస్ట్రీ నుంచి 4 రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు కర్ణాటక రాష్ట్రం తరపు నుండి మూడు నంది అవార్డులు కూడా లభించాయి. ఇక మద్రాసు నుంచి ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి ఇరవై అవార్డులను, ఆరు నేషనల్ అవార్డులను.. ఒకటి ఇన్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు తో పాటు ఇతర అవార్డులు 41 గెలుపొందారు.. మొత్తంగా చూసుకుంటే ఈయన 125 రంగాలలో నామినేట్ చేయబడగా..ఏకంగా 116 అవార్డులను కైవసం చేసుకున్నారు.

ఇక 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును,  2011 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో పాటు 2021 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.. అంతే కాదు లైఫ్ టైం అచీవ్మెంట్ 20 20 కి తాజాగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. 1981వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి 1999లో గౌరవ డాక్టరేట్ తో పాటు మరెన్నో అంతులేని అవార్డులను, పురస్కారాలను పొంది,ఒక గొప్ప గాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: