రాజమౌళి దాదాపుగా చాలా రోజుల నుండి తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగ్స్ రాస్తున్నారు. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీం గా యాక్ట్ చేస్తుండగా ఒలీవియా మోరిస్, అలియా భట్ కథానాయికలుగా యాక్ట్ చేస్తున్నారు.

ఎంతో భారీ స్థాయిలో పేట్రియాటిక్ డ్రామాతో పాటు పక్కాగా కమర్షియల్ హంగులు కూడా కలగలిపి దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని తీసినట్లు టాక్. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు ఇతర భారతీయ భాషలు మరియు హాలీవుడ్ కి చెందిన పలువురు నటులు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా అనుకున్న దానికంటే మరింత గొప్పగా రాజమౌళి తీసారని ఇన్నర్ వర్గాల టాక్. ప్రస్తుతం విదేశాల్లో ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతున్నట్లు టాక్.

అయితే అసలు విషయం ఏమిటంటే, ఇప్పటివరకు చాలా సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ మూవీ కి సంబంధించి ఇప్పటివరకు తాజా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడంతో కొద్దిరోజుల నుండి పలువురు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ ఆవేదనని కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. ఎందరో హీరోల సినిమాలు షూటింగ్స్ జరుపుకుని ఆపైన థియేటర్స్ లోకి వస్తున్నాయి. కానీ మా హీరోల సినిమాకి ఎప్పుడు మోక్షం జక్కన్నా, ఇకనైనా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్ చేయండి అంటూ వారు దర్శకుడు రాజమౌళిని కోరుతున్నారు. మరి వారి విజ్ఞప్తిని ఆమోదించి ఇకనైనా రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: