తెలుగులో దేశభక్తి మీద చాలా సినిమాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా గాంధీ మీద వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ సినిమాల్లోని కొన్ని పాటలు గాంధీ లేని ఇండియా ఎలా ఉందో గుర్తు చేస్తాయి. అలాంటి పాటనే శంకర్ దాదా జిందాబాద్ సినిమాలోని ఓ బాపు నువ్వే రావాలి పాట. దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈ  పాటలో మనం గాంధీ గొప్పతనం ఆయన చేసిన గొప్ప ఉద్యమాల గురించి చాల చక్కగా వర్ణించారు. సుద్దాల అశోక్ తేజ గారు రచించిన ఈ పాట ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బాపు నువ్వు మళ్ళీ రావాలి అని అశోక్ తేజ గారు చాలా అద్బుతంగా రాసారు.

ఇక ఈ పాట సినిమాలో ఉండకపోయిన కూడా ఆడియో మాత్రం చాలా ఫేమస్ అయ్యింది. హిందీలో సూపర్ హిట్ అయిన లేగేరాహో మున్నాభాయ్ సినిమాకి తెలుగు రీమేక్ గా శంకర్ దాదా జిందాబాద్ వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హిందీలో సంజయ్ దత్ పాత్రని తెలుగులో వేశారు. గాంధీ గురించి పుస్తకాలు బాగా చదివిన శంకర్ కి గాంధీ కనిపించి ఆయన్ని గాంధీయ వాదంలో ఎలా నడిపారు అనేది ఈ సినిమా కథ. హిందీ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం అంత గొప్పగా ఆడలేదు.

కానీ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో గాంధీగా నటించిన దిలీప్ గారికి లాగేరాహో మున్నా భాయ్ సినిమాలో గాంధీ నటనకి గాను నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ సినిమాలోని ఆయన అచ్చం గాంధీ లాగానే ఉండటం సినిమా చూసిన అందరికి ఆశ్చర్యాన్ని కల్గించింది. తెలుగులో కూడా గాంధీగా ఆయన్నే తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: