మెమోరీ లాస్ లాంటి కాన్సెప్ట్స్ మీద చాలా సీరియస్ సినిమాలు తెలుగు తమిళంలో చాలానే వచ్చాయి. అయితే ఈ థీమ్ ని మారుతీ తీసుకొని ఆయన స్టైల్ లో చేసిన సినిమానే భలే భలే మొగాడివోయ్. నాని కి ఈ సినిమాకి ముందు సరైన హిట్స్ లేవు. ఎప్పుడో వచ్చిన అలా మొదలైంది సినిమా తర్వాత చాలా సంవత్సరాలు నాని హిట్ కోసం ఎదురుచూశారు. అయితే ఆయన హిట్ ఆకలిని ఈ సినిమా తీర్చింది.

 మన అందరికి ఉండే మతిమరుపు హీరోకి కొంచెం ఎక్కువగా ఉంటే ఎలా తన జీవితం మారిపోయింది అనేది ఈ సినిమా కథ. నాని ఈ సినిమాలో పండించిన కామెడీ అంత ఇంత కాదు. వెన్నెల కిషోర్ తో కలిసి హిలేరియోస్ ఎంటర్టైన్మెంట్ నాని ఈ సినిమాతో ఇచ్చాడు. అప్పటిదకా చిన్న చిన్న సినిమాలు చేసే మారుతి ని ఈ సినిమా స్టార్ డైరెక్టర్ ని చేసింది. విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది.

నాని కెరీర్ లో అప్పటిదకా విడుదలైన సినిమాల్లో ఇదే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించిన సినిమాగా నిలిచింది. ఎక్కడ వల్గారిటీ లేకుండా హాయిగా ఫామిలీ తో చూసే సినిమా తీసాడు డైరెక్టర్ మారుతి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కి ఆయనకి నంది అవార్డ్ వచ్చింది. అలాగే హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి కూడా సినిమాతో స్టార్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో ఇంకొక హైలెట్ సంగీతం. మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకి సూపర్ హిట్ ఆల్బమ్ ని ఇచ్చాడు. గీత ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ భలే భలే మొగాడివోయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 30 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టి అందరిని ఆశ్చర్య పరిచింది. .

మరింత సమాచారం తెలుసుకోండి: