తెలుగు హీరోలలో రాజేంద్రప్రసాద్ గారి కామెడీ టైమింగ్ ని కొట్టేవాళ్ళు లేరు అనే చెప్పాలి. ఆయన కామెడీ సినిమాలు అన్ని దాదాపుగా సూపర్ హిట్ అవ్వడానికి గల కారణం కూడా ఆయన టైమింగ్ అనే చెప్పాలి. ఆయన ప్రస్తుతం సహాయ నటుడుగా హాస్యాన్ని పండిస్తున్నారు కానీ ఒకప్పుడు ఆయన నటించిన కామెడీ సినిమాలు జనాలకి ఎంత ఆనందాన్ని ఇచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజేంద్రప్రసాద్ గారి బెస్ట్ కామెడీ సినిమాల విషయానికి వస్తే ముందుగా అహన పెళ్ళంటా సినిమా గురించి మాట్లాడుకోవాలి.

ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారికి రాజేంద్రప్రసాద్ కి మధ్య వచ్చే కామెడీ ఇప్పటికి కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక జయంబు నిశ్చయంబు సినిమాలో రాజేంద్రప్రసాద్ గారు , చంద్ర మోహన్ గారు ఇద్దరు చేసిన అల్లరి అంత ఇంత కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే లేడీస్ టైలర్ , ఏప్రిల్ ఒకటి విడుదల , ఆ ఒక్కటి అడక్కు లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఆయన వయసు పెరిగేకొద్దీ సహాయ నటుడిగా కూడా రాజేంద్రప్రసాద్ గారు కామెడీ పండిస్తూనే ఉన్నారు. చివరి సంవత్సరం సంక్రాంతి కి వచ్చిన సరిలేరు నికెవ్వరు, అలా వైకుంటాపురంలో రెండు సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో కామెడీ ఒక రేంజ్ లో పండించారు.

ఈ సినిమాలు రెండు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రాజేంద్రప్రసాద్ గారికి ఆయన సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ఇస్తుంటారు. అనిల్ రావిపూడి ని కూడా రాజేంద్రప్రసాద్ తన సొంత కొడుకులగా చూసుకుంటాడు అని ఒక రాజేంద్రప్రసాద్ గారు చెప్పారు. ఒకప్పటి  ప్రధాన మంత్రి పివి నరసింహన్ గారు కూడా నా సినిమాలకి ఫ్యాన్ అని ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. నట కిరీటిగా పేరున్న రాజేంద్రప్రసాద్ 60 ఏళ్ల వయసులో కూడా వరసగా తెలుగు తమిళంలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: