సాధారణంగా రచయితలు రాసే కొన్ని డైలాగులు హీరో హీరోయిన్లకు మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టడమే కాకుండా, సినిమాకు కూడా అత్యంత విజయాన్ని చేకూరుస్తూ ఉంటాయి. హీరోలకు మాత్రమే డైలాగులు రాయకుండా హీరోయిన్లకు కూడా రచయితలు ప్రత్యేకంగా డైలాగులు రాసి, హీరోయిన్ లలో కూడా సత్తా ఉంది అని చాటి చెప్పేలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పాపులర్ డైలాగ్స్ తో హీరోయిన్లు కూడా హైలెట్ అవుతూ ఉంటారు.. ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్ల అంటూ వచ్చే సాయిపల్లవి లాగే , వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో ప్రార్థనా.. ప్రతీ రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ వచ్చే డైలాగ్ తో రకుల్ ప్రీతిసింగ్ కూడా చాలా హైలెట్ గా నిలిచింది..

సినిమా కథ మొత్తం కేవలం ఒక ట్రైన్ లోనే జరుగుతుంది. ఈ సినిమా ఆద్యంతం  మొత్తం నవ్వులు-పువ్వులు పూయిస్తూ.. 100 తప్పులు చేస్తే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి అనే తండ్రి ఆజ్ఞ.. సప్తగిరి, తాగుబోతు రమేశ్ కామెడీ అన్నీ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి.  పృధ్విరాజ్ డైలాగులు, అతని నటన, కామెడీ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ కూడా బాగా నటించి, డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.


2013వ సంవత్సరంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించారు. జెమినీ కిరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు , దర్శకుడు మేర్లపాక గాంధీ రచయితగా వ్యవహరించి, మంచి సంభాషణలను చేకూర్చాడు. 2013లో విడుదలైన ఈ చిత్రం ద్వారా స్క్రీన్ ప్లే రచయితగా మేర్లపాక గాంధీ నంది పురస్కారాన్ని అందుకోగా, ఉత్తమ హాస్యనటుడిగా తాగుబోతు రమేష్ నంది పురస్కారాలను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ చెప్పే..ప్రార్థనా.. ప్రతీ రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ సాగే డైలాగ్స్ తో రకుల్ ప్రీతిసింగ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: