తెలుగు ప్రేక్షకులకు యాంకర్ అనగానే యాంకర్ సుమ గుర్తుకొస్తుంది. ఈమె కేరళకు చెందిన తెలుగు అమ్మాయి. అయితే రాజీవ్ కనకాల ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె ఇక్కడే సెటిల్ అయిపోయింది. మొదటి సారిగా తెలుగులో నటిగా పరిచయం అయిన తర్వాత నిదానంగా యాంకర్ వైపు అడుగులు వేసింది. అలా యాంకరింగ్ వైపు అడుగులు వేసిన తర్వాత ఎటువంటి ప్రోగ్రామ్ కి అయినా ఈమె ఓకే చెబుతూ ఇప్పుడు స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది.


యాంకర్ సుమ తన కెరియర్ మొదట్లో సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా తన నటనను తగ్గిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఆమె సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు గా తెలుస్తోంది. అంతేకాకుండా ఈమెను కూడా చాలామంది సినిమాల్లో నటించమని అడుగుతూ ఉండడంతో ఈమె కూడా ఒకసారి నటిస్తాం అంటూ ఒక ఫన్నీ వీడియోను షేర్ చేయడం జరిగింది.

అయితే సుమ మొదట్లో చిన్న చిన్న సినిమాలలో నటించింది. కానీ ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఉన్నది కనుక స్టార్ హీరోలతో నటించే అవకాశం ఎక్కువగా ఉన్నది. అందుచేతనే ఈమె ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాజెక్టు లో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుమ అభిమానులు కూడా ఈమెను వెండి తెరపై చూడాలని చాలా ఆతృతగా ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో సుమా కొన్ని సినిమాల్లో గెస్ట్ గా కూడా వచ్చింది.అయితే ఇప్పుడు కూడా చేయబోయే సినిమా పూర్తి  స్థాయిలో పాత్ర చేసే విధంగా ఉంటుందో లేదో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు.


అయితే త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈమె ఏ హీరో సినిమాలో నటించబోతోంది అనే విషయంపై ఎక్కువగా సర్చింగ్ చేస్తున్నారట. అయితే ఒకవేళ నటించినా సుమను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: