ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి తమ కెరీర్ లో తొలిసారిగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం పేరుతో దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమా కి దాదాపుగా రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. డివివి దానయ్య తీస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్ల క్రితం కంప్లీట్ అయింది. ఎన్టీఆర్ ఇందులో తెలంగాణ వీరుడు కొమరం భీం పాత్ర చేస్తుండగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో విడుదలై మంచి స్పందన అందుకున్న విషయం తెలిసిందే.

ఆ తరువాత సినిమాలోని తొలి సాంగ్ దోస్తీ ని ఐదు భాషల్లో విడుదల చేసి శ్రోతల నుండి మంచి స్పందన అందుకున్న యూనిట్, నేడు కొద్దిసేపటి క్రితం సినిమా నుండి నాటు నాటు పల్లవితో సాగే రెండవ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. మంచి ఊర మాస్ లిరిక్స్, బీట్స్ తో అందరికీ మంచి కిక్ ఇచ్చేలా సాగిన ఈ పాటని యువ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించగా ఈ లిరికల్ సాంగ్ లో అటు ఎన్టీఆర్ , ఇటు చరణ్ ఇద్దరూ కూడా తమ అదిరిపోయే స్టెప్స్ తో అందరి మతి పోగొట్టారు.

స్వతహాగా మంచి డ్యాన్సర్స్ అయిన ఈ ఇద్దరు నటులు ఈ సాంగ్ లో అదరగొట్టడంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైక్స్ తో దూసుకెళుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ రాబోయే 24 గంటల్లో యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ పాట మాత్రమే కాదని సినిమాలోని ఇతర సాంగ్స్ కూడా అదిరిపోవడంతో పాటు అవి రేపు తెరపై ఇవి మరింతగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని, ఓవరాల్ గా సినిమా పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని ఆర్ఆర్ఆర్ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాని 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: