ఈ రంగుల ప్రపంచంలో ఏమైన జరగచ్చు. సినీ ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. తెర పై ఒక్కే సినిమాలో హీరో హీరోయిన్ లు గా కనిపించి సినిమాలో లవ్ చేసుకుంటున్నట్లు  నటించి.. నిజంగా నే ప్రేమలో పడిపోయిన నటులు  చాలా మందినే చూశాం. రీల్ లైఫ్ లో జోడీగా నటించి హిట్ కొట్టి ..  రియల్‌ లైఫ్ కూడా భార్య  భర్తలుగా మంచి పేరు తెచ్చుకున్న కపుల్స్ లల్లో  ఒక్కరు సూర్య, జ్యోతిక. కోలీవుడ్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.

వీళ్లిద్దరూ సినీ ఫ్యామిలీస్  కు చెందిన వారే . జ్యోతిక ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా కుర్రకారుకి నిద్రపట్టకుండా చేసిన నగ్మా కజిన్. సూర్య కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ కి చెందిన వారే.. ఒకప్పటి హీరో శివకుమార్ కొడుకునే ఈ సూర్య. వీళ్లిద్దరు కలిసి ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించగా..లాస్ట్ సిల్లును ఒరు కాదల్‌ అనే సినిమాలో నటించి..  ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. సూర్య, జ్యోతిక 2006లో వివాహం చేసుకున్నారు.  వీళ్ళకి  ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ జంటకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య కి లేడీ ఫాలోయింగ్ ఇంకొంచెం ఎక్కువే ఉంది. 15 ఏళ్లు గడిచిన వీరి వైవాహిహక జీవితంలో ఎన్నో స్వీట్ మె మోరీస్ ఉన్నాయి .

అయితే వీళ్ల గురించి చాలా మందికి తెలియని విషయం ఒక్కటి ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతికను రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. ఈ సంగతి  బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. వీళ్లు ప్రేమించుకునే రోజుల్లోనే సూర్య ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా జ్యోతిక మెడలో మూడు ముళ్లు వేసేసారట. ఇంట్లో పెద్దవాళ్లకి తమ ప్రేమ విషయం చెప్పడానికి బయపడి ఇలా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారట. ఆ తరువాత ఈ సంగతి వాళ్ల నాన్నకు తెలిసి..ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా..ఇక చేసేది ఏం లేక..మళ్ళీ అందరి ముందు వీరికి ఘనంగా పెళ్లి జరిపించారట. అలా సూర్య జ్యోతికను రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారన మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: